AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: గూగుల్‌లో జాబ్ కోసం ఇంటర్వ్యూ పాస్ అయ్యా.. ఇల్లు కోసం ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యా.. వ్యక్తి వింత కథ తెలిస్తే మీరు షాక్..

ఒక యువకుడు ప్రముఖ సంస్థ Google ఇంటర్వ్యూను కూడా దాటాడు. మంచి జాబ్ ను దొరకబుచ్చుకున్నాడు. అయితే అతను ఇంటిని రెంట్ కు తీసుకునే సమయంలో ఇంటి యజమాని ఇంటర్వ్యూలో విఫలమయ్యాడు. ఇదేంటి వింత కథ అని అనిపించవచ్చు.. కానీ ఇది నిజమే.

Viral News: గూగుల్‌లో జాబ్ కోసం ఇంటర్వ్యూ పాస్ అయ్యా.. ఇల్లు కోసం ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యా.. వ్యక్తి వింత కథ తెలిస్తే మీరు షాక్..
Mr Bhadoria
Surya Kala
|

Updated on: Mar 25, 2023 | 7:28 AM

Share

ఒక నిరుద్యోగి .. చిరుద్యోగిగా లేదా తమకు నచ్చిన మెచ్చిన ప్రభుత్వం ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగాల కోసం. ఇంటర్వ్యూ వరకూ వెళ్ళడానికి అనేక రౌండ్‌లను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా ఉద్యోగానికి సంబంధించిన రౌండ్స్ క్లియర్ చేసిన అనంతరం.. చివరిగా ఇంటర్వ్యూ ని నిర్వహిస్తారు. అయితే కొందరు.. అన్ని స్థాయిలను క్లియర్ చేస్తారు.. అయితే ఉద్యోగంలో చివరి మెట్టు అయిన ఇంటర్వ్యూలో విఫలమవుతారు. దీంతో ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. అయితే ఒక యువకుడు ప్రముఖ సంస్థ Google ఇంటర్వ్యూను కూడా దాటాడు. మంచి జాబ్ ను దొరకబుచ్చుకున్నాడు. అయితే అతను ఇంటిని రెంట్ కు తీసుకునే సమయంలో ఇంటి యజమాని ఇంటర్వ్యూలో విఫలమయ్యాడు. ఇదేంటి వింత కథ అని అనిపించవచ్చు.. కానీ ఇది నిజమే.

గూగుల్ ఇంటర్వ్యూని సులభంగా దాటి.. ఉద్యోగం సంపాదించిన రిపు దామన్ భడోరియా.. ఉద్యోగ విధులను నిర్వహించడం కోసం బెంగళూరికి షిప్ట్ అయ్యాడు. అయితే రిపు దామన్ భడోరియా బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఇవ్వవలసి ఉంటుందని తెలియగానే.. షాక్ అయ్యాడు… ఎలాగో అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అయితే అతను విఫలమయ్యాడు. దీంతో రిపు దామన్ భడోరియా అద్దెకు గది దొరకలేదు. ఇదే విషయాన్ని అద్దె ఇంటికి కోసం ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా సైట్ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. దీంతో వినియోగదారులను చాలా ఆశ్చర్యానికి గురయ్యారు.

భడోరియా తన జీవితంలో ఇంటి కోసం జరిగిన ఇంటర్వ్యూలో విఫలమైనందుకు బాధతో పాటు బాధతో పాటు సంతోషం కూడా కలిగిందని పేర్కొన్నాడు. అంతేకాదు అసలు ఈ ఇంటర్వ్యూ ముందు గూగుల్ ఇంటర్వ్యూ ఏమీ లేదు. గత సంవత్సరం 2022 లో తాను  బెంగుళూరుకు షిప్ట్ అయ్యానని తెలిపాడు. కోవిడ్ తర్వాత వెంటనే ఇల్లు సంపాదించడం చాలా కష్టం అయింది. అనేక చాలా సమస్యల తర్వాత ఇల్లు దొరికింది. అయితే అద్దె ఇంటిలో దిగడానికి తాను ఇంటర్వ్యూ ఇవ్వవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

నిజానికి ఇదంతా ఎందుకంటే బెంగళూరులో మంచి ఇళ్ళకు చాలా డిమాండ్‌ ఉంది. దీంతో చాలా మంది ఇంటి యజమానులు తమ ఇంటికి అద్దెకు ఇవ్వడానికి ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. అదే తన విషయంలోనూ జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూ లో తాను ఫెయిల్ అయినట్లు పేర్కొన్నాడు రిపు దామన్ భడోరియా.

ఇంటర్వ్యూ లో వైఫల్యం చెందిన తర్వాత తాను ఎందుకు ఇంటర్వ్యూ లో పాస్ కాలేదని ఇంటి యజమానిని అడిగినట్లు రిపు చెప్పాడు. మీరు గూగుల్‌లో పనిచేస్తున్నారని.. కనుక మీరు ఇంటిని కొనుగోలు చేయగలరు.. అద్దె ఇల్లు ఎందుకు అని తాను భావించినట్లు ఇంటి యజమాని చెప్పాడు. అయితే రిపు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించినందున తాను సంతోషంగా ఉన్నానని.. తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అటువంటి పరిస్థితిలో ఇంటిని అద్దెకు తీసుకునే సమయంలో ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్లాలనుకుంటున్నారా.. ఉత్తీర్ణత సాధించే ట్రిక్ తన నుండి నేర్చుకోవచ్చని తెలిపాడు రిపు భడోరియా.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..