Viral Video: అర్ధరాత్రి బైక్ చెడిపోయి రోడ్డుమీద ఉన్న ఫ్యామిలీకి జవాన్ల సాయం.. హృదయాన్ని ఆకట్టుకున్న వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ఆర్మీ సైనికులు అర్థరాత్రి కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు.

Viral Video: అర్ధరాత్రి బైక్ చెడిపోయి రోడ్డుమీద ఉన్న ఫ్యామిలీకి జవాన్ల సాయం.. హృదయాన్ని ఆకట్టుకున్న వీడియో వైరల్
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2023 | 8:51 AM

భారత ఆర్మీ సైనికులు దేశ రక్షణ కోసం.. తమ కుటుంబాన్ని.. ప్రాణాలను సైతం లెక్కచేయక ఎండకు ఎండుతూ.. వానలో తడుస్తూ.. తమ విధులను నిర్వహిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేశాన్ని రక్షించడమేకాదు.. అవసరం ఏర్పడినప్పుడు.. దేశం లోపల కూడా తమ విధులను నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ అవతలివారిని రక్షిస్తారు. దేశంలో అల్లకల్లోల పరిస్థితిలు ఏర్పడిన సమయంలో జవాన్లు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకుని వస్తుంది. అంతేకాదు.. ఎవరైనా కష్టంలో ఉంటే.. వారిని ఆదుకోవడానికి ముందుంటుంది ఆర్మీ.. ప్రస్తుతం ఆర్మీ జవాన్ల మంచి మనసుని తెలిపే మరొక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజల హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ఆర్మీ సైనికులు అర్థరాత్రి కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అర్ధరాత్రి.. ఒక కుటుంబం నిర్జన రహదారిపై నిలబడి ఉంది. ఆ సమయంలో వారి బైక్ చెడిపోయింది. దీంతో తమకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆలోచిస్తున్నారు. అయితే అటుగా వెళ్తున్నవారు వీరిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇంతలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు అటుగా వస్తున్నారు. వారు రోడ్డు పక్కన నిలబడిన ఫ్యామిలీని చూసి వారిదగ్గర ఆగారు. అదే సమయంలో తన బైక్ ను మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బైక్ స్టార్ట్ కాలేదు. అటువంటి పరిస్థితిలో.. జవాన్ తన మానవత్వంతో తన బైక్‌ను ఆ కుటుంబానికి ఇచ్చి.. వారి చిరునామాను  తీసుకున్నారు. అప్పుడు ఆ ఫ్యామిలీ ఆర్మీ జవాన్లకు థాంక్స్ చెప్పి.. అర్ధ రాత్రి సేఫ్ గా తమ ఇంటికి వెళ్లడం కనిపించింది. బహుశా ఈ జవాన్లు ఆ బైక్ ను రిపేర్ చేసిన అనంతరం.. ఆ బైక్ ను బైక్ యజమానికి ఇచ్చి.. తమ బైక్ ను తిరిగి తెచ్చుకోవచ్చు.. ఏదైనా ఏమైనా ఆర్మీ జవాన్లు స్పందించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో @HasnaZarooriHai అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘దేశంలోని నిజమైన హీరోలకు సెల్యూట్..  గౌరవం’ అనే క్యాప్షన్ ఇచ్చారు. రెండు నిమిషాల 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 40 వేలకు పైగా వీక్షించగా, 3 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

అందరికీ అంత పెద్ద మనసు ఉండదు’ అని కొందరంటే, ‘ఈ సైనికులు మనసు గెలుచుకున్నారు’ అని మరికొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు