AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్ళికి గాడిద బండిపై ఎంట్రీ ఇచ్చిన పాకిస్థానీ వధూవరులు.. డ్రామా అవసరమా అంటున్న నెటిజన్లు

ఈ దృశ్యాన్ని పెళ్లి వేడుకఁక్కి వచ్చిన ఆహుతులు తమ కెమెరాలలో బంధిస్తున్నారు. ఈ వీడియోను చూడటమే కాకుండా ఒకరికొకరు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Viral Video: పెళ్ళికి గాడిద బండిపై ఎంట్రీ ఇచ్చిన  పాకిస్థానీ వధూవరులు.. డ్రామా అవసరమా అంటున్న నెటిజన్లు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2023 | 8:28 AM

ప్రపంచవ్యాప్తంగా వివాహాలను భిన్నమైన ఆచారాలతో అద్భుతంగా నిర్వహిస్తారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకలను జరుపుతారు. పెళ్లి తంతులో భాగంగా పెళ్లికూతురు ఎంట్రీ నుంచి వివాహ తంతు వరకూ అన్నింటిలో సృజనాత్మక పద్ధతులను అవలంబిస్తున్నారు. పెళ్లి కి వచ్చే స్నేహితులు, అతిధుల నుంచి పెళ్లికి జరిగే సంప్రదాయాల వరకూ రకరకాల పద్దతులను అవలంభిస్తారు.   తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో తెరపైకి వచ్చింది. వధూవరులు గాడిదపై ఎక్కి పెళ్లి జరిగే పందిరిలోకి ఎంట్రీ ఇచ్చారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో పాకిస్థాన్‌కు చెందినది. వధూవరులు గాడిద బండిపై కూర్చొని పెళ్లిలోకి ప్రవేశించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గాడిదకు అందంగా దుస్తులు ధరింపజేశారు. దానిని తమ బండికి కట్టారు. ఈ దృశ్యాన్ని పెళ్లి వేడుకఁక్కి వచ్చిన ఆహుతులు తమ కెమెరాలలో బంధిస్తున్నారు. ఈ వీడియోను చూడటమే కాకుండా ఒకరికొకరు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి కోసం వధూవరులు ఇచ్చిన ఈ ఎంట్రీ నిజంగా చాలా విభిన్నంగా.. అద్భుతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. వధూవరులు గాడిద బండిపై ఎంట్రీ ఇస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఒక వ్యక్తి గాడిదను పట్టుకుని అదుపు చేస్తూ ఆ బండిని ముందుకు తీసుకుని వెళ్తుండగా..  వధూవరులు ఆ బండిలో  వెనుక కూర్చుని ఉన్నారు. ఈ వీడియో Instagramలో pakistan_glitz అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ క్లిప్‌కి వందల కొద్దీ లైక్‌లు, వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను చూడటమే కాకుండా రకరకాల కామెంట్స్ర చేస్తున్నారు.

ఒక వినియోగదారు ‘ఎవరైనా తమ పెళ్లికి ఈ విధంగా ఎవరైనా ఎంట్రీ ఇస్తారా సోదరా?’ అని కామెంట్ చేస్తే.. మరో వైపు, ‘గాడిదల దేశంలో ఇలాంటివి జరగడం పెద్ద విషయం కాదు’ అని మరొకరు కామెంట్ చేశారు. పెళ్లిలో ఇంత డ్రామా అవసరం లేదని చాలా మంది అన్నారు. అయితే కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ లో  వరుడు తనకు కాబోయే భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..