Viral Video: ఇంకెన్ని విడ్డూరాలు చూడాల్సి వస్తుందో.. ఏడాది చిన్నారి మెదడులో పెరుగుతున్న పిండం..!
చైనా వాణిజ్య నగరం షాంఘైలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఏడాది వయసున్న శిశువు మెదడులో పిండం ఉన్నట్టు గుర్తించిన వైద్యులు షాక్ అయ్యారు. తల నొప్పి సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు
చైనా వాణిజ్య నగరం షాంఘైలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఏడాది వయసున్న శిశువు మెదడులో పిండం ఉన్నట్టు గుర్తించిన వైద్యులు షాక్ అయ్యారు. తల నొప్పి సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. శరీరంలోని కండరాల్లో కదలికలు సరిగా లేకపోవడంతో వైద్య సిబ్బంది స్కాన్ చేశారు. మెదడులో పిండాన్ని చూసి డాక్టర్స్ షాకయ్యారు. నాలుగు అంగుళాలు ఉన్న పిండానికి పలు అవయవాలతోపాటు వేళ్ల గోర్లు కూడా వృద్ధి చెందినట్లు గుర్తించారు. శిశువు తల్లిగర్భంలో పెరుగుతున్నప్పుడే అవి అభివృద్ధి చెంది ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. కవల పిల్లల్లో ఒక పిండం ఎదిగి, మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఈ అరుదైన కేసును ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారని పేర్కొన్నారు. పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు విభజన సరిగా జరగకపోతే ఒక పిండం మెదడులో మరో పిండం కలిసిపోతుందన్నారు. కాగా, ఫుడాన్ వర్సిటీలోని హుయాసన్ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ జోంజే విజయవంతంగా శస్త్రచికిత్స చేసి మెదడులోని పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!