Viral: కన్న బిడ్డ కోసం కొట్లాట.. జర్మనీ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ ప్రధాని మోదీకి ఓ జంట వినతి.
బతుకుదెరువు కోసం జర్మన వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. లైంగిక దాడి అనుమానాలతో వారి చిన్నారిని జర్మనీ ప్రభుత్వం లాగేసుకుంది. దీంతో స్వదేశానికి తిరిగొచ్చిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ తమకు దక్కేలా
బతుకుదెరువు కోసం జర్మన వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. లైంగిక దాడి అనుమానాలతో వారి చిన్నారిని జర్మనీ ప్రభుత్వం లాగేసుకుంది. దీంతో స్వదేశానికి తిరిగొచ్చిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ తమకు దక్కేలా చూడాలంటూ ప్రధాని మోదీని వేడుకుంటున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంట 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీ రాజధాని బెర్లిన్ వెళ్లింది. అక్కడ వారికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు నెలల వయసున్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ఆమె జననాంగం వద్ద గాయమైంది. దీంతో ఆమెకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ దేశ శిశు సంరక్షణ అధికారులు ఆ పాపను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. జర్మనీలో పుట్టిన ఆ పాప సంరక్షణ తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని తేల్చిచెప్పారు. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో ఆ పాపను అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసింది. అప్పటికి ఆ చిన్నారి వయసు ఏడాదిన్నర. దీంతో ఆ తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న ఆ పాప.. ఏడాదిన్నరగా జర్మనీ అధికారుల కస్టడీలోనే ఉంది. అక్కడ న్యాయం జరగకపోవడంతో ఆ తల్లిదండ్రులు తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. ముంబయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో తాము డీఎన్‌ఏ నమూనాలు కూడా ఇచ్చామని, 2022 ఫిబ్రవరిలోనే లైంగిక వేధింపుల కేసు మూసేశారని చిన్నారు తల్లిదండ్రులు చెప్పారు. అవన్నీ తీసుకుని మేం జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారుల దగ్గరకు వెళ్లినప్పటికీ వారు తిరిగి తమపైనే కేసు పెట్టారని, ఇదే విషయంపై కోర్టుకెళ్తే అక్కడ తల్లిదండ్రులుగా మా బిడ్డను పెంచే సమర్థతను నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించిందని మీడియా సమావేశంలో అన్నారు. అయితే ఆ పరీక్షల్లో సైకాలజిస్టు తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడంతో తమ బిడ్డ తమకు కాకుండాపోయిందంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నెలకోసారి గంట మాత్రమే కలిసేందుకు అనుమతిచ్చారు. ఈ విషయంలో తమకు సాయం చెయ్యాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే

