Viral Video: వంటలతో ఈ ప్రయోగాలు ఏమిట్రా బాబోయ్.. ఆపిల్స్, జామకాయలతో బజ్జీలు తయారీ.. నరకంలో నీకే ఫస్ట్ ప్లేస్..నెటిజన్ల ఫైర్

ఈ క్లిప్ చూసిన తర్వాత, మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ వైరల్ వీడియోలో ఒక యువకుడు మొదట యాపిల్స్  జామపండ్లను తీసుకొని.. వాటిని రౌండ్ గా చిన్న చిన్న స్లైస్ గా కట్ చేశాడు.

Viral Video: వంటలతో ఈ ప్రయోగాలు ఏమిట్రా బాబోయ్.. ఆపిల్స్, జామకాయలతో బజ్జీలు తయారీ.. నరకంలో నీకే ఫస్ట్ ప్లేస్..నెటిజన్ల ఫైర్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2023 | 10:42 AM

ప్రపంచంలో ఆహారంతో చేసిన ప్రయోగాలు షాకింగ్‌గా ఉంటున్నాయి. కొంతమంది భిన్నమైన ప్రయోగాలతో టేస్టీగా హెల్తీగా ఆహారాన్ని తయారు చేస్తుంటే.. మరికొందరు బాబాయ్ ఇలాంటి ప్రయోగాలు అన్నంత రోతని తెప్పిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఆహార పదార్ధాల తయారీ వీడియో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు వంటగదిలో అడుగు పెట్టినప్పటిన వారు నెట్టింట్లో వైరల్ అయ్యే వంటకాలను చూసి అవి తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలాంటి వీడియోల  క్రేజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం ఏ రెస్టారెంట్లు, ఏ వీధి వ్యాపారులు ఎవరిని చూసినా ఏదో ఒక కొత్త వంటకం చేస్తూ  బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రయోగం ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

టీ తాగుతూ కాంబినేషన్ గా పకోడీలు లేదా బజ్జిలను తినడం బెస్ట్ కాంబినేషన్.. వాతావరణంతో సంబంధం లేకుండా సాయంత్రం పూట టీతో పాటు ప్లేటులో పకోడీలు వంటి స్నాక్స్ దొరికితే ఇక ఏం చెప్పాలి..! మీరు తప్పనిసరిగా వివిధ రకాల పకోడీల.. మిర్చి బజ్జి, బంగాళాదుంప బజ్జిలు వంటి వాటిని తిని ఉంటారు. ఉల్లి పాయలు,  బంగాళదుంపలు, మిర్చి వంటి వాటితో తయారు చేసిన స్నాక్స్ ను తిని ఉంటారు. అయితే ఆపిల్,  జామ కాయలతో తయారు చేసిన పకోడీలను గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కాకపోతే ఈ రోజుల్లో ఈ పకోడీల గురించి చర్చ జరుగుతోంది. ఇది చూసి తినాలన్న కోరిక చెడిపోతోందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ చూసిన తర్వాత, మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ వైరల్ వీడియోలో ఒక యువకుడు మొదట యాపిల్స్  జామపండ్లను తీసుకొని.. వాటిని రౌండ్ గా చిన్న చిన్న స్లైస్ గా కట్ చేశాడు. అనంతరం శనగపిండిలో నీరు, కొంచెం కారం, ఉప్పు వేసి.. బజ్జిల పిండిగా తయారు చేశాడు. అనంతరం ఆ పండ్ల ముక్కలను తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిలో వేసి డీప్ చేసి.. వేడెక్కిన నూనెలో వేసి..  ఫ్రై చేశాడు. వేగిన అనంతరం యాపిల్, జామ బజ్జీలు రెడీ అయ్యాయి. అనంతరం వాటిని సర్వ్ చేశాడు.

ఈ వీడియోను @nickhunterr అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేసారు. వార్త రాసే వరకు 18 వేల మందికి పైగా చూశారు. ఇదేమి పైత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ‘పండ్లతో ఇలా ఎవరు చేస్తారు సోదరా! అదే సమయంలో, మరొకరు ‘నరకం తలుపులు మొదట ఈ వ్యక్తికి మాత్రమే తెరవబడతాయంటూ తన కోపాన్ని వ్యక్తం చేశాడు.  ఇది కాకుండా, కొంతమంది అద్భుతమైన కలయిక అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..