AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puffer Fish: బీచ్‌లో ప్రమాదకరమైన చేపను టచ్ చేసిన కుక్క, యువతి .. సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం

ఆ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌లో నడుచుకుంటూ వెళుతుండగా..ఆమె పెంపుడు కుక్క ఆత్రంగా ఆ జీవిని నోట కరుచుకుంది. ఈ ప్రమాదకరమైన వింత జీవి ఆసి బీచ్ లో  కనిపించింది. 

Puffer Fish: బీచ్‌లో ప్రమాదకరమైన చేపను టచ్ చేసిన కుక్క, యువతి .. సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం
Puffer Fish
Surya Kala
|

Updated on: Mar 17, 2023 | 1:32 PM

Share

ఆస్ట్రేలియాలోని ఒక ప్రసిద్ధ మెల్బోర్న్ బీచ్‌లో ఒక యువతి తన పెంపుడు కుక్క సరదాగా షికారు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ కుక్క బీచ్ లో ఉన్న ఒక జీవిని తినడానికి ప్రయత్నించింది. ఈ జీవి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేప జాతులలో ఒకటి అని ఆ యువతి చెప్పింది. కుక్క చనిపోయిన చేపను తీయడాన్ని గమనించింది. తరువాత అది ప్రమాదకరమైన పఫర్ ఫిష్‌గా గుర్తించినట్లు పేర్కొంది. ఆ యువతి అంతేకాదు తన కుక్క దీనిని తినాలని నిర్ణయించుకుంది,” అంటూ ప్రముఖ సోషల్ మీడియా పేజీ రెడ్డిట్‌లో ఆ చేప ఫోటోను పోస్ట్ చేసింది.

నోట కరచుకున్న చేపని వదలడానికి తన కుక్క నిరాకరించిందని.. అప్పుడు తాను దానిని కుక్క నోటి నుండి తీసివేయవలసి వచ్చింది. ఇలా చేస్తున్న సమయంలో తన బొటనవేలుపై చిన్న ముళ్లు గుచ్చుకున్నట్లు తాను భావిస్తున్నానని తెలిపింది. మరి ఇప్పుడు మేము బాగుంటామా?” అంటూ ప్రశ్నించింది.

సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం

ఇవి కూడా చదవండి

ఈ పఫర్ ఫిష్‌ లో 30 మందిని చంపడానికి తగినంత విషం ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు పఫర్ ఫిష్  చనిపోయిన లేదా సజీవంగా ఉన్నా.. తింటే మానవులకు, కుక్కలకే కాదు ఎవరికైనా ప్రాణాంతకం కావచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన జీవుల్లో ఒకటి పఫర్ ఫిష్. దీని చర్మంపై, అంతర్గత అవయవాల్లో టెట్రోడోటాక్సిన్ అనే టాక్సిన్‌ను కలిగి ఉంటుంది. ఇలాంటిది నీలిరంగు ఆక్టోపస్‌లో కూడా కనిపిస్తుంది. యానిమల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకారం ఇది సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది.

స్మాల్ యానిమల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ జార్జినా చైల్డ్ ఈ టాక్సిన్  “నిమిషాల్లో” జంతువులను చంపేస్తుందని హెచ్చరించింది. ఈ చేపను టచ్ చేసిన తర్వాత ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వెంటనే సమీపంలోని వెట్‌కి తరలించాలని సూచించారు. తరచుగా వాంతులు చేసుకోవచ్చు .. చాలా త్వరగా బలహీనపడవచ్చు, నిలబడటానికి ఇబ్బంది పడతారు” అని డాక్టర్ జార్జినా చైల్డ్ చెప్పారు. అంతేకాదు ఆ జీవి కదిలే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. తరువాత శోషించబడిన టాక్సిన్ పరిమాణాన్ని బట్టి శ్వాస తీసుకోలేనంత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

యువతి, కుక్క ప్రస్తుతం సేఫ్ 

ప్రస్తుతం చేపను తాకిన యువతి కుక్క సేఫ్ గా ఉన్నారని… పశువైద్యుడు పేర్కొన్నారు. ఇద్దరిలోనూ ఏ లక్షణాలు లేవని చెప్పారు. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..