Rain of Worms: చైనాలో వింత వాన.. నిజం తెలిస్తే నవ్వులే నవ్వులు.. వైరల్ అవుతున్న వీడియో..

ఇళ్లూ... వీధుల్లో కురుస్తున్న పురుగుల వానకు భయపడి జనం ఇళ్ళల్లోనుంచి బయటకు రావడంలేదన్న వార్తలు పూర్తిగా అబద్దమని కొన్ని వార్త పత్రికలు తేల్చాయి. 

Rain of Worms: చైనాలో వింత వాన.. నిజం తెలిస్తే నవ్వులే నవ్వులు.. వైరల్ అవుతున్న వీడియో..
China Worm Rain
Follow us

|

Updated on: Mar 17, 2023 | 10:02 AM

చైనాకీ పురుగులకీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. చైనాలో ఎప్పుడూ ఏదో ఒక విచిత్రం యావత్‌ ప్రపంచంలో సంచలనాత్మకంగా మారుతుంది. తాజాగా మరో విచిత్రం అక్కడ కలకలం రేపుతోంది. అదేపురుగుల వాన. అయితే వైరల్ అవుతున్న పురుగుల వాన వీడియోలో నిజమేనా అన్న విషయం  తెలుసుకోండి

కరోనాని మోసుకొచ్చిన బీజింగ్‌…ఇప్పటికింకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీజింగ్‌లో ఒళ్ళుగగుర్పొడిచే దృశ్యం ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. అదే పురుగుల వాన. బీజింగ్‌లో ఓ రకమైన పురుగులు ఆకాశంలో నుంచి వర్షంతో పాటు ఏకధాటిగా పడుతున్న దృశ్యాలు స్థానికుల్లో కలకలం రేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా బీజింగ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. కానీ వర్షాల తో పాటు తాజాగా బీజింగ్‌ వీధుల్లో కురుస్తోన్న పురుగుల వాన అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆకాశం నుంచి కురుస్తోన్న ఓ రకమైన పురుగుల దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇళ్లూ… వీధుల్లో కురుస్తున్న పురుగుల వానకు భయపడి జనం ఇళ్ళల్లోనుంచి బయటకు రావడంలేదన్న వార్తలు పూర్తిగా అబద్దమని కొన్ని వార్త పత్రికలు తేల్చాయి.

ఇవి కూడా చదవండి

నిజం ఏమిటంటే?

వైరల్ అవుతున్న వీడియోలో కార్ల పైన కనిపించే ముదురు రంగు వస్తువులు పాప్లర్ అనే చెట్టు పువ్వులని అవి కీటకాలు కావని అంటున్నారు. అవి నిజంగా కీటకాలు అయితే, అవి కదులుతాయి. కానీ అవి కదల కుండా చాలా స్థిరంగా ఉన్నాయి. అంతేకాదు ఆకాశం నుంచి నిజంగా పురుగుల వర్షం కురిసి ఉంటే ఆ ప్రాంతం అంతా పురుగులు కనిపించేవి.. ఒక్క కారు మీద మాత్రమే పురుగులు ఎందుకు కనిపిస్తాయని చెబుతున్నారు.

చైనాలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అక్కడ కీటకాల వర్షం కురుస్తుందనే చర్చ అబద్ధం అని రాశారు. కార్ల పైన కనిపించేవి పోప్లర్ చెట్టు పువ్వులు అంటారని చెప్పారు. ఈ పువ్వు దగ్గరి నుండి తీసిన చిత్రాలను షేర్ చేశారు. చెట్లు కారు అద్దాల్లో ప్రతిబింబిస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియోను జాగ్రత్తగా గమనిస్తే అందులో చెట్ల నీడ కనిపిస్తోంది.

ఈ వీడియోను కొందరు వ్యక్తులు వీడియో ప్లాట్‌ఫారమ్ ‘డౌయిన్’లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఒక వ్యక్తి చైనీస్ భాషలో ఒక క్యాప్షన్ ఇచ్చారు. హిందీ అనువాదంలో, ‘కార్లపై పడిన పాప్లర్ పువ్వులు.. అవి దూరం నుండి చూస్తే కీటకాలుగా కనిపిస్తాయి’ అని రాశారు. చైనాలో పోప్లర్ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి.

ఈ వీడియో ఎక్కడిదంటే?

వీడియోలో, అనేక దుకాణాల వెలుపల చైనీస్ భాషలో వ్రాసిన బోర్డులను చూడవచ్చు. రెండు కార్ల నంబర్ ప్లేట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిపై రాసివున్న నంబర్ల గురించి కాస్త రీసెర్చ్ చేసిన తర్వాత చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఉన్న షెన్యాంగ్ నగరానికి చెందిన వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ నంబర్లు అని తెలిసింది. దీంతో ఈ వీడియో షెన్యాంగ్ నగరానికి చెందినది కావచ్చునని తెలుస్తోంది.

నిజానికి చైనాలో పురుగుల వర్షం కురిసి ఉంటే, కనీసం అక్కడి ప్రధాన వార్తా వెబ్‌సైట్‌లలోనైనా ప్రస్తావన వచ్చి ఉండేదని తమకు ఎటువంటి ఆధారం దొరకలేదని ఆ ప్రముఖ వార్త పత్రిక పేర్కొంది.

మరోవైపు పురుగుల వర్షం పై  ‘సెంట్రల్ పొలిటికల్ అండ్ లీగల్ అఫైర్స్ కమిషన్’ అంటే చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ CPLC కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో పురుగుల వర్షం కాదని చెప్పింది. ఆ వీడియో నివేదికలు తప్పు అని ప్రకటించింది. అంతేకాదు అవి పోప్లర్ పూలు మాత్రమేనని స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..