Cyclone Freddy: ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 326 మంది మృతి.. కలరా విజృంభణ.. మోడీ సంతాపం..

ప్రస్తుతం ఫ్రెడ్డీ తుఫాను ప్రభావం తగ్గినా.. ప్రభావిత ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు హెచ్చరించారు.

Cyclone Freddy: ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 326 మంది మృతి.. కలరా విజృంభణ.. మోడీ సంతాపం..
Cyclone Freddy
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2023 | 11:57 AM

ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఓ వైపు తుఫాన్, మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక సమస్యల బారిన పడుతున్నారు. మొజాంబిక్‌, మలావిలో సంభవించిన వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తుఫాను 326 మందికి పైగా మరణించారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే ప్రస్తుతం ఫ్రెడ్డీ తుఫాను ప్రభావం తగ్గినా.. ప్రభావిత ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు హెచ్చరించారు.

326 మంది మృతి:

ఇవి కూడా చదవండి

ఆర్థిక రాజధాని బ్లాంటైర్‌తో సహా దక్షిణ మలావిలో కనీసం 326 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 88,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా 14 రోజుల జాతీయ సంతాప దినాలుగా  ప్రకటించారు. కుండపోత వర్షాల కారణంగా వరదలు, బురదజల్లుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రపంచ దేశాలు సాయం అందించాలని చక్వేరా విజ్ఞప్తి చేశారు.

50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు

మొజాంబిక్‌లో శనివారం నుండి కనీసం 53 మంది మరణించారని, 50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు చెప్పారు. వేల సంఖ్యలో ప్రజలు తుఫాను సహాయ శిబిరాల్లో ఉన్నారు.

లా నినా ప్రపంచంపై ప్రభావం చూపుతుంది

ఇటీవల ముగిసిన లా-నినా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో తుఫానుల ఫ్రీక్వెన్సీ పెరుగుదలకు దారితీసింది. ఫ్రెడ్డీ తుఫాను ఫిబ్రవరి నుండి దక్షిణ ఆఫ్రికాలో విధ్వంసం సృష్టించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలావి, మొజాంబిక్, మడగాస్కర్‌లో ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. కష్ట సమయాల్లో బాధిత దేశాల ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..