చైనా శాస్త్రవేత్తల సరికొత్త సృష్టి.. ఎలుక తలపై జింక కొమ్ములు! మానవులకు ప్రయోజనాలన్న సైంటిస్టులు

ఈ ప్రయోగం ప్రభావానికి చెందిన చిత్రాలు ప్రస్తుతం దర్శనమిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎలుకల నుదిటిపై కొమ్ములు ముందుకు  పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎలుకల చెవుల్లో మార్పులు కూడా కనిపిస్తున్నాయి.

చైనా శాస్త్రవేత్తల సరికొత్త సృష్టి.. ఎలుక తలపై జింక కొమ్ములు! మానవులకు ప్రయోజనాలన్న సైంటిస్టులు
Chinese Scientists
Follow us

|

Updated on: Mar 16, 2023 | 10:24 AM

చైనా శాస్త్రవేత్తలు వింత ప్రయోగాలకు ప్రసిద్ధి చెందారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలనే తలంపు కూడా వీరి సొంతం. గత కొంత కాలంగా అనేక ప్రయోగాలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా చైనా  నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నికల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎలుకల తలపై జింక కొమ్ములను పెంచడం ప్రారంభించారు. ఈ ప్రయోగం ప్రభావానికి చెందిన చిత్రాలు ప్రస్తుతం దర్శనమిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎలుకల నుదిటిపై కొమ్ములు ముందుకు  పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎలుకల చెవుల్లో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఎలుకల తలలపై కొమ్ముల పొడవు పెరుగుతున్నాయని చెప్పారు.

శాస్త్రవేత్తలు ఎలుకల తలపై కొమ్ములను ఎలా పెంచారో.. ఎన్ని రోజుల్లో కొమ్ముల మొలకల ప్రభావం కనిపించడం ప్రారంభించింది.. ఇది మానవులకు ఎలా ఉపయోగపడుతుందనేది తెలుసుకోండి..

ప్రయోగం ఎలా మొదలైందంటే: శాస్త్రవేత్తలు మాట్లాడుతూ..  ఎలుకలపై ఈ ప్రయోగం చేయడానికి మొదట జింక కొమ్ములను తీసుకున్నారు. వాటి నుంచి స్టెమ్ సెల్స్ వేరు చేశారు. అనంతరం ఆ స్టెమ్ సెల్స్ ను అది ఎలుక నుదిటిపై అమర్చారు. క్రమంగా, ఎలుకల తలపై ఒక ఉబ్బెత్తు పెరగడం ప్రారంభమైంది.. కొమ్ములుగా మారడం ప్రారంభించారు. ఎలుకల్లో మూలకణాలను మార్పిడి చేసిన 45 రోజుల్లోనే .. ప్రభావం కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మానవులకు ఎంత ప్రయోజనం అంటే: ఈ ప్రయోగం ఫలితాలు మానవులకు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం ఎలా జరిగిందో, అదే విధంగా మానవుల ఎముకల మృదులాస్థిని సరిచేయవచ్చు. లేదా కాళ్లను కత్తిరించిన తర్వాత.. తిరిగి పెరిగే విధంగా చేయవచ్చు అని అంటున్నారు.

జింక కొమ్ముల ప్రయోజనాలు: శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. జింక శరీరంలో ప్రతి సంవత్సరం పెరిగే ఏకైక భాగం కొమ్ములు.  దాని  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాయి. బ్లాస్టెమా కణాలు కొమ్ముల్లో కనిపిస్తాయి. ఈ కణాలు కోల్పోయిన కొమ్ములు తిరిగి పెరిగేలా చేస్తాయి. అందుకే ఈ కణాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

సానుకూల ఫలితాలు: కొమ్ముల పెంపకం కోసం 2020లో వివిధ శాస్త్రవేత్తల బృందాలు ప్రయోగాలు చేశాయి. ఈ ప్రయోగం ద్వారా  ఎలుక తలపై జింక కొమ్ములను పెంచవచ్చా లేదా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయోగం ద్వారా, కొమ్ముల పునరుద్ధరణకు జింకలోని బ్లాస్టెమా కణాలు ఎంతవరకు కారణమో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు చేసిన  ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

75 వేల కణాల ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్: సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఎలుకల తలపై కొమ్ములు పెంపక  ప్రయోగం కోసం.. శాస్త్రవేత్తలు 75000 జింక కణాల ఆర్‌ఎన్‌ఎను పరిశీలించారు. ఇది ఎలుకలలోకి మార్పిడి చేయడానికి ముందు..  తరువాత పరీక్షించారు. 10 రోజుల క్రితం జింక  కొమ్ముల్లో ఇలాంటి కణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఇవి కొమ్ముల పెరుగుదలలో  కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..