Geyser Gas: గీజర్ గ్యాస్ లీకై దంపతులు మృతి.. ప్రాణాల కోసం పోరాడుతున్న కుమారుడు

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూంలో ఉన్న వారి ఐదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని వెంటనే ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.

Geyser Gas: గీజర్ గ్యాస్ లీకై దంపతులు మృతి.. ప్రాణాల కోసం పోరాడుతున్న కుమారుడు
Geyser Gas Leak
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2023 | 9:31 AM

గీజర్ నుండి గ్యాస్ లీకై ప్రాణాలు తీస్తున్న ఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి దారుణ ఘటన ఒకటి జరిగింది. బాత్‌రూమ్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక దంపతులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్రూంలో ఉన్న వారి ఐదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని వెంటనే ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. కుమారుడు  ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. మృతులు శివనారాయణ ఝన్వర్ (37), అతని భార్య కవితా ఝన్వర్ (35) కాగా కుమారుడు విహాన్ లు షాపురా నివాసితులు.  షీత్లా అష్టమి రోజున రంగులతో ఆడుకున్నారని విచారణ అధికారి జితేంద్ర సింగ్ తెలిపారు.

రంగులను వదిలించుకునేందుకు ముగ్గురు బాత్ రూమ్ కి వెళ్లి.. రెండు గంటలకు పైగా బాత్‌రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు తలుపు తట్టినా స్పందన లేదు. దీంతో బాత్ రూమ్ తలుపులు పగులగొట్టారు. అప్పుడు గీజర్ ఆన్‌లో ఉండడం గుర్తించారు. అంతేకాదు తల్లిదండ్రులతో పాటు ఐదేళ్ల కుమారుడు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండడం చూశారు. వెంటనే ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే దంపతులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విహాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని.. చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ