Jammu Kashmir: శివయ్యకు జలాభిషేకం చేసిన జమ్మూ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.. రాజకీయ జిమ్మిక్కు అంటున్న బీజేపీ నేతలు
మెహబూబా ముఫ్తీ ఆలయాన్ని ప్రదక్షిణ చేసిన అనంతరం శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న యశ్‌పాల్ శర్మ విగ్రహానికి పూలమాల సమర్పించారు. యశ్‌పాల్ శర్మ శివాలయాన్ని నిర్మించారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పూంచ్ జిల్లాలో పర్యటన సందర్భంగా నవగ్రహ ఆలయంలో ప్రార్థనలు చేశారు. పూంచ్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత పూంచ్ సరిహద్దులోని నవగ్రహ ఆలయానికి చేరుకున్నారు. మెహబూబా ముఫ్తీ ఆలయాన్ని ప్రదక్షిణ చేసిన అనంతరం శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న యశ్‌పాల్ శర్మ విగ్రహానికి పూలమాల సమర్పించారు. యశ్‌పాల్ శర్మ శివాలయాన్ని నిర్మించారు.
మెహబూబా ముఫ్తీ ఆలయాన్ని సందర్శించి.. శివయ్యకు అభిషేకం చేయడంపై జమ్మూకశ్మీర్ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఇదంతా రాజకీయ జిమ్మిక్కు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు 2008లో మెహబూబా ముఫ్తీ.. ఆమె పార్టీ నేతలు పుణ్యక్షేత్రం అమరనాథ్ బోర్డుకు భూమి కేటాయింపును వ్యతిరేకించిందని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం అధికార ప్రతినిధి రణబీర్ సింగ్ పఠానియా గుర్తు చేశారు.
ఆలయ సందర్శన ఓ జిమ్మిక్కు మాత్రమే
మెహబూబా ముఫ్తీ సీఎంగా ఉన్న సమయంలో అమరనాథ్ యాత్రికుల కోసం షెల్టర్స్ నిర్మాణం కోసం పుణ్యక్షేత్రం బోర్డుకు తాత్కాలికంగా భూమిని బదిలీ చేయడానికి PDP అనుమతి ఇవ్వలేదని రణబీర్ సింగ్ పఠానియా చెప్పారు. మరి ఇప్పుడు శివాలయాన్ని దర్శించుకోవడం ఓ నాటకం మాత్రమే అని చెప్పారు. ఇది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. రాజకీయ జిమ్మిక్కుల ద్వారా మార్పు తీసుకురాగలిగితే.. జమ్మూ కాశ్మీర్ నేడు ఎంతో సుభిక్షంగా ఉండేది.
వీడియో వైరల్
వాస్తవానికి పాకిస్థాన్‌ను.. అది చేసే చర్యలను ఎప్పుడూ సమర్థించే పీడీపీ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుధవారం పూంచ్‌లోని ఓ ఆలయంలో ముఫ్తీ దర్శనం ఇచ్చారు. శివలింగానికి జలాభిషేకం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.
Former J&K CM Mehbooba Mufti prays at temple. pic.twitter.com/bcZ26umU63
— News Arena India (@NewsArenaIndia) March 16, 2023
ఆలయాన్ని నిర్మించిన మాజీ ఎమ్మెల్సీ యశ్‌పాల్ శర్మ బీజేపీ దీనిని పొలిటికల్ స్టంట్ , జిమ్మిక్ అని అభివర్ణించగా.. మెహబూబా ముఫ్తీ హిందూ-ముస్లింల గురించి మాట్లాడుతూ.. ప్రజల మధ్య మతపరమైన విభజనను సృష్టించి ఓట్లు పొందడం కోసమే అని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు. మీడియా నివేదికల ప్రకారం.. ముఫ్తీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా భారతదేశం-పాకిస్తాన్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న డెరియన్ గ్రామంలో PDP మాజీ MLC యశ్‌పాల్ శర్మ నిర్మించిన నవగ్రహ ఆలయ దర్శనం కోసం వెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..