AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basara: అమ్మతో బాసరకు ఆథునిక శ్ర‌వ‌ణుడు.. ఇప్పటివరకు 65412 కిలోమీటర్లు..

ఆనాడు శ్రావణుడు తల్లిదండ్రులను కావడిపై మోస్తూ తీర్థయాత్రలు చేస్తే ఓ అభినవ శ్రావణుడు తల్లి రుణం తీర్చుకునేందుకు స్కూటర్‌పై తీర్థయాత్రలు చేస్తున్నాడు. అన్నీ ఇవ్వడమే తప్ప ఏదీ అడగని అమ్మకు ఈ లోకాన్ని చూపించేందుకు గత నాలుగేళ్ళుగా స్కూటర్‌పై మాతృసేవా సంకల్ప యాత్ర చేస్తున్నాడు ఓ కొడుకు.

Basara: అమ్మతో బాసరకు ఆథునిక శ్ర‌వ‌ణుడు.. ఇప్పటివరకు 65412 కిలోమీటర్లు..
Dakshinamurthy Krishna Kumar With His Mother
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2023 | 8:17 AM

Share

అమ్మంటే …తన రక్తాన్ని చెమటగా మార్చి…. తన చివరి శ్వాస వరకూ తన కుటుంబం కోసం, బిడ్డల కోసం సర్వస్వాన్ని అర్పించి…తను కరిగిపోయే ఓ కొవ్వొత్తి. ఆ కొవ్వొత్తి కరిగిపోయాక లక్షలు ఖర్చుపెట్టి ఓ ఫొటో పెట్టి దండేస్తే…రుణం తీరదని భావించారు మైసూరుకి చెందిన కృష్ణకుమార్‌. అందుకే జీవితమంతా పిల్లలకోసం పరితపించి… సర్వస్వం త్యాగం చేసిన తల్లికి ఓ అపురూపమైన బహుమతిని అందించాలనుకున్నాడు. మాతృసేవా సంకల్ప యాత్రకు పూనుకున్నాడు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్న….అమ్మమదిలోని కోర్కెను తీర్చేందుకు సంసిద్ధమయ్యాడు ఈ అభినవ శ్రవణ కుమారుడు. యాత్రలో భాగంగా బుధవారం తల్లీ కొడుకులు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మ వద్దకు చేరుకున్నారు.

మైసూరుకి చెందిన  44ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు దక్షిణామూర్తి కృష్ణకుమార్‌…తన లక్ష రూపాయల జీతాన్ని వదులుకొని, తండ్రి జ్ఞాపకార్థం ఉంచుకున్న స్కూటర్ పై తన తల్లి సూరారత్నమ్మను తీసుకొని.. జనవరి 16, 2018లో మైసూరులో ఈ మాతృసేవా సంకల్ప యాత్రని ప్రారంభించారు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, గోవా, కేరళ, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలలో పుణ్యక్షేత్రాలను తల్లికి చూపించారు. ఇప్పటివరకు 65412 కిలోమీటర్లు మేర స్కూటర్ పై ప్రయాణించారు తల్లీ కొడుకులు. తల్లి కోరిక నెరవేరుస్తున్న కొడుకుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Basara

తెలంగాణ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..