యజమాని చనిపోయినా 3 నెలలుగా ఆసుపత్రిలో ఎదురుచూస్తున్న పెంపుడు శునకం

మనుషులకు, శునకాలకు మధ్య ఉండే అనుబంధమే వేరు. ఒక్కసారి శునకానికి అన్నం పెట్టి చేరదీస్తే తన యజమాని దగ్గరే జీవితాంతం ఉంటుంది. మనుషులకు ఉండే విశ్వాసాల కన్నా శునకాలకు ఉండే విశ్వాసమే ఎక్కువ.

యజమాని చనిపోయినా 3 నెలలుగా ఆసుపత్రిలో ఎదురుచూస్తున్న పెంపుడు శునకం
Dog
Follow us

|

Updated on: Mar 16, 2023 | 10:46 AM

మనుషులకు, శునకాలకు మధ్య ఉండే అనుబంధమే వేరు. ఒక్కసారి శునకానికి అన్నం పెట్టి చేరదీస్తే తన యజమాని దగ్గరే జీవితాంతం ఉంటుంది. మనుషులకు ఉండే విశ్వాసాల కన్నా శునకాలకు ఉండే విశ్వాసమే ఎక్కువ. అవి తమ యజమానులు చెప్పినట్లు వింటూ ఇంటికి కాపాల కాస్తూ ఓ రక్షణగా ఉంటాయి. ఎప్పుడైన తమ యజమానులు ఇంటికి రాకపోతే లేదా అకస్మాత్తుగా చనిపోతే ఎదురుచూస్తేనే ఉంటాయి. నిజానికి శునకాలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని ఓ పెంపుడు శునకం కూడా తన యజమాని కోసం ఆస్పత్రిలో చాలా రోజులు ఎదురుచూస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

తమిళనాడులోని సేలంలో ఉన్న మోహన్ కుమార మంగళం అనే వ్యక్తి మూడు నెలల క్రితం గుండెపోటు బారిన పడ్డాడు. వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆయన పెంపుడు శునకం కూడా ఆ ఆసుపత్రికి వచ్చింది. మోహన్ ని బతికించేందుకు వైద్యులు చాలా ప్రయత్నాలు చేశారు. కాని చివరికి మోహన్ మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు. కాని తన యజమాని లోపలే ఉన్నాడని ఆ శునకం భావించింది. దాదాపు మూడు నెలల నుంచి ఆయన రాక కోసం నిరీక్షిస్తోంది. అక్కడ ఉండే ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపినప్పటికీ తన యజమాని కోసం మళ్లీ వస్తుంది. ఎన్నిసార్లు బయటకు పంపించిన లాభం లేదనుకుని ఆసుపత్రి సిబ్బందే ఆ శునకానికి ప్రతిరోజు ఆహారం అందిస్తున్నారు.