Turkey Floods: టర్కీలో ప్రకృతి విలయతాండవం.. భూకంపం నుంచి తేరుకోకముందే కంటనీరు పెట్టిస్తున్న జల ప్రళయం..

భూకంపంతో అతలాకుతలమైన టర్కీని ఇప్పుడు జలప్రళయం హడలెత్తిస్తోంది. వెల్లువెత్తిన వరదల ధాటికి పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ఇళ్లూ..ఊళ్ళూ.. ఏకమయ్యాయి.

Turkey Floods: టర్కీలో ప్రకృతి విలయతాండవం.. భూకంపం నుంచి తేరుకోకముందే కంటనీరు పెట్టిస్తున్న జల ప్రళయం..
Turkey Floods
Follow us

|

Updated on: Mar 16, 2023 | 9:16 PM

టర్కీలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. నిన్నటి వరకు భూకంపాలతో హడలిపోయిన టర్కీలో ఇప్పుడు జలప్రళయం కల్లోలం రేపుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వెల్లువెత్తిన వరదలతో సౌత్‌ ఈస్ట్‌ టర్కీలోని రెండు నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరద భీభత్సానికి జనం అతలాకుతలమయ్యారు. ఈ జలప్రళయానికి 23 మంది మృత్యువాత పడ్డారు.

ఫిబ్రవరి 6న టర్కీలో వచ్చిన భూకంపానికి 48 వేల మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ భూకంప విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టర్కీని భీకర వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు పదుల సంఖ్యలో వరదల్లో కొట్టుకుపోయారు. వరద బాధితుల్లో అత్యధిక మంది భూకంపం నుంచి బయటపడి కంటైనర్‌ హోమ్స్‌లో తలదాచుకుంటున్నవారే కావడం మరింత విషాదకరంగా మారింది. టర్కీ వరద భీభత్స దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

జలప్రళయం టర్కీని కుదిపేస్తోంది. 24 గంటల్లో అదియమాన్‌లోని ఓ ప్రాంతంలో 136 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊళ్ళకు ఊళ్ళే వరదల్లో కొట్టుకుపోయాయి. వీధుల్లో కొట్టుకొస్తోన్న శవాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి.

అదియాన్‌లోని కంటైనర్స్‌లో ఉంటున్న భూకంప బాధిత కుంటుంబాలు వరదల్లో చిక్కకుని ప్రాణభయంతో భీతిల్లిపోయాయి. వరదల్లో కొట్టుకొచ్చిన మానవ కళేబరాల హృదయ విదారక దృశ్యాలు మనసుల్ని కలచివేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..