Viral : ఆటో నడిపిన బిల్ గేట్స్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
బిల్‌గేట్స్ ఇండియా పర్యటనలో అధికారిక కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే టైం దొరికినప్పుడల్లా సరదాగా గడుపుతూ.. ఇక్కడి సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు.
బిల్‌గేట్స్ ఇండియా పర్యటనలో అధికారిక కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే టైం దొరికినప్పుడల్లా సరదాగా గడుపుతూ.. ఇక్కడి సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ఆయన స్వయంగా కిచిడీ తయారుచేసుకొని తిన్నారు. ఇప్పడు తాజాగా ఆటో నడుపుతూ సందడి చేశారు. ఆయన మహీంద్రా ఆటోను స్వయంగా నడుపుతూ దూసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోను బిల్‌గేట్స్.. క్లాస్‌మేట్, మంచి మిత్రుడు అయిన మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడీ’ అంటూ కామెంట్ చేశారు. ఈ సారి మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు మీరు, నేను, సచిన్ టెండూల్కర్ 3 వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ పెట్టుకుందామని తన మిత్రుడికి సూచనచేశారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ కొత్త కొత్త విషయాలు కనుక్కోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని, ఇది తనకు ఆశ్చర్యరం కలిగిస్తుందని అన్నారు. తాను ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపానని ఇది సుమారు 81 మైళ్లు ప్రయాణించగలదని చెప్పారు. మహీంద్రా వంటి కంపెనీలు ట్రాన్స్ పోర్టేషన్ రంగంలో డీకార్బొనైజేషన్ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కాగా బిల్‌గేట్స్, ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!