AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Sea Drone Crash: నల్లసముద్రంలో డ్రోన్‌ కూల్చివేత.. రష్యాపై అమెరికా ఫైర్.. సంచలన వీడియో విడుదల

అమెరికా రష్యాల మధ్య బ్లాక్‌ సీ పై అమెరికా నిఘా డ్రోన్‌ కూల్చివేత కాంట్రవర్సీ కాకరేపుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా బయటపెట్టిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.

Black Sea Drone Crash: నల్లసముద్రంలో డ్రోన్‌ కూల్చివేత.. రష్యాపై అమెరికా ఫైర్.. సంచలన వీడియో విడుదల
Black Sea Drone Crash
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2023 | 7:52 PM

Share

నల్ల సముద్రంపైనున్న అమెరికా నిఘా డ్రోన్‌ కూల్చివేత అంశంలో అగ్రరాజ్యం అమెరికా రష్యాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా నల్లసముద్రంలో అమెరికా డ్రోన్‌ను రష్యా జెట్‌ కూల్చేసిన వీడియో విడుదల చేసింది. నల్లసముద్రంపై రెండు రష్యన్‌ విమానాలు అమెరికన్‌ డ్రోన్‌పై దాడిచేసిన వీడియో ప్రపంచ నిఘా వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రెండు రష్యా విమానాలు తమ మానవరహిత MQ-9 విమానం మీద ఇంధనాన్ని చల్లి నిప్పు పెట్టినట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. అయితే – అంతర్జాతీయ గగనతలం పరిమితుల్లోనే విహరించామనీ అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ అన్నారు. రష్యా తన విమానాలను బాధ్యతాయుతంగా నడపాలని మాత్రమే అమెరికా రక్షణ మంత్రి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

నల్లసముద్రంలో అమెరికా డ్రోన్‌ను రష్యా కూల్చేయడంపై మాటలతూటాలు పేలుతున్నాయి. ఉక్రెయిన్‌లోని తమ పరిధిలోకి వచ్చినందుకే అమెరికా డ్రోన్‌ను పేల్చేసినట్లు రష్యా తెలిపింది. కానీ తమ డ్రోన్‌ అంతర్జాతీయ జలాల మీద విహరిస్తోందని అమెరికా రక్షణసంస్థ పెంటగాన్‌ చెబుతోంది. అయితే- తమ డ్రోన్‌ శకలాలు రష్యా చేతుల్లో పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అమెరికా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు కావాలనే డ్రోన్‌ను కూల్చివేశారనే ఆరోపణలను రష్యా ఖండించింది. రష్యాపై నిఘా కార్యాకలాపాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మాస్కో నిషేధించిన ఫ్లైట్‌ జోన్‌ను పట్టించుకోకపోవడమే ఈ డ్రోన్‌ కూల్చివేతకు కారణమని షొయిగు అన్నారు.

అయితే, అమెరికా డ్రోన్ కూల్చివేతకు సంబంధించిన వీడియోను.. అమెరికా విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..