Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Death Penalty: ఉరిశిక్ష తీర్పు తర్వాత జడ్జ్‌లు పెన్ నిబ్ ఎందుకు విరిచేస్తారో తెలుసా? చెరపలేని రక్తాక్షరాలివి..

ఏ వ్యక్తికైనా కోర్టులో మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇస్తే.. ఆ తర్వాత ఆ ఫైల్‌పై సంతకం చేసిన పెన్నును జడ్జి విరిచేస్తాడని మీకు తెలుసా? అవును.. మన దేశ న్యాయ వ్యవస్థలో అనాదిగా ఈ ఆచారాన్ని..

Death Penalty: ఉరిశిక్ష తీర్పు తర్వాత జడ్జ్‌లు పెన్ నిబ్ ఎందుకు విరిచేస్తారో తెలుసా? చెరపలేని రక్తాక్షరాలివి..
Break Pen's Nib
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2023 | 5:20 PM

నేరాలకు పాల్పడిన నిందితులను కోర్టులో విచారించి నేరం రుజువైతే తగిన శిక్ష విధించడం షరా మామూలే. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష లేదా ఉరి శిక్ష విధిస్తుంటారు. ఐతే ఏ వ్యక్తికైనా కోర్టులో మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇస్తే.. ఆ తర్వాత ఆ ఫైల్‌పై సంతకం చేసిన పెన్నును జడ్జి విరిచేస్తాడని మీకు తెలుసా? అవును.. మన దేశ న్యాయ వ్యవస్థలో అనాదిగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. మరణశిక్ష విధించిన తర్వాత పెన్ నిబ్ పగలగొట్టే ఆచారం బ్రిటిష్ కాలం నుంచి భారతీయ న్యాయమూర్తులు అనుసరిస్తున్నారు. నిజానికి.. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత పెన్‌ నిబ్‌ను విచ్ఛిన్నం చేయాలనే ప్రత్యేక నియమం ఏదీ న్యాయ వ్యవస్థలో లేదు. అదొక సంప్రదాయంగా మాత్రమే అనుసరిస్తున్నారు. ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో మరణశిక్ష విధించిన తర్వాత న్యాయమూర్తి పెన్నును విరిచేయాలని ఎక్కడా పేర్కొనలేదు కూడా. ఐతే దీనిని పాటించడం వెనుక కొన్ని ఉద్ధేశ్యాలు ఉన్నాయి.

క్షమించరాని నేరం చేసిన వారికి మరణ శిక్ష విధిస్తారు. ఒక వ్యక్తి మరణ తీర్పును రాసి, సంతకం పెట్టిన తర్వాత తీర్పును సమీక్షించేందుకు లేదా రద్దు చేసే అధికారం న్యాయమూర్తులకు ఉండదు. జడ్జి ఒక్కసారి ఇచ్చిన తీర్పును మరోమారు సమీక్షించుకోవాలని ఆలోచించకుండా ఉండేందుకు పెన్‌ నిబ్ విచ్చిన్నం చేస్తారు. ఆ పెన్ ఒక వ్యక్తి జీవితానికి ముగింపు పలుకుతుంది. అలాంటి దురదృష్టకరమైన కలాన్ని మరోసారి వాడకూడదు.. మరో వ్యక్తి మరణశాసనంపై సంతకం పెట్టేపరిస్థితి రాకూడదనే ఉద్దేశం కూడా దీని వెనక ఉంది. రక్తం రుచిమరిగిన పెన్నుగా దానిని పరిగణించి, మరో ప్రాణం తీసే అవకాశం ఆ పెన్‌కు ఇవ్వకూడదనే సెంటిమెంట్‌ కూడా ఉంది. మరణశిక్ష విధించడం అనేది న్యాయమూర్తులకు కష్టతరమైన తీర్పు. ఆ విధంగా విధించాక, ఆ తీర్పు వల్ల అసంతృప్తి గానీ, పశ్చాత్తాపం గానీ కలగకూడదనే భావన న్యాయమూర్తికి కలగకూడదని ఈ ఆచారాన్ని అలానే కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.