Dog Train Journey: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. రైలులో కుక్కలకూ రిజర్వేషన్.. పూర్తి వివరాలు ఇవి..

మీ పెంపుడు కుక్కలను మీతోనే తీసుకెళ్లవచ్చు. రైలులోనే వాటిని తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఎంచక్కా రిజర్వేషన్ చేయించుకొని బెర్త్ లో పడుకోబెట్టి మరీ తీసుకెళ్లొచ్చు. భారతీయ రైల్వే శాఖ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

Dog Train Journey: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. రైలులో కుక్కలకూ రిజర్వేషన్.. పూర్తి వివరాలు ఇవి..
dog train journey
Follow us
Madhu

|

Updated on: Mar 17, 2023 | 9:42 AM

కుక్కలు విశ్వాసానికి ప్రతీక అంటుంటారు. నిజమే అవి యజమాని పట్ల అమితమైన ప్రేమను చూపిస్తాయి. అందుకే వాటిని ఇంట్లో వ్యక్తిలాగా చూస్తారు. దానితో అనుబంధాన్ని పెంచుకుంటారు. ఎక్కడకి వెళ్లినా వెంట తీసుకెళ్తారు. అయితే ఎప్పుడైనా కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు టూర్ వెళ్లినప్పుడు, వాటిని ఎవరైనా తెలిసిన వాళ్ల ఇంట్లోనే లేదా.. మీ పనివారికో అప్పగించి వెళ్తుంటారు. అయితే ఇకపై మీకు ఆ కష్టం ఉండదు. మీ పెంపుడు కుక్కలను మీతోనే తీసుకెళ్లవచ్చు.

రైలులోనే వాటిని తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఎంచక్కా రిజర్వేషన్ చేయించుకొని బెర్త్ లో పడుకోబెట్టి మరీ తీసుకెళ్లొచ్చు. భారతీయ రైల్వే శాఖ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వీటిపై చాలా మందికి అవగాహన లేదు. అసలు రైళ్లలో ఇలా కుక్కలను తీసుకెళ్లవచ్చన్న విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. టికెట్ ఎలా బుక్ చేయాలి? చార్జీలు ఎలా ఉంటాయి? వంటి అంశాలను తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో మీ కుక్కను రైలులో తీసుకెళ్లే ముందు, మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం రండి..

  • సెకండ్ క్లాస్ లగేజీ, బ్రేక్ వ్యాన్ (SLR)లో కుక్కను ఓ పెట్టేలో పెట్టి పెంపుడు కుక్కను తీసుకెళ్లవచ్చు. దీనికి 30 కేజీల సాధారణ లగేజీ చార్జీలు వసూలు చేస్తారు.
  • అలాగే ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణికుడితో తీసుకెళ్లడానికి కూడా అనుమతి ఉంది. మొత్తం కూపే (2 బెర్తర్ లేదా 4 బెర్తర్)ను ప్రయాణికుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 60 కేజీల లగేజీ బరువుకు వసూలు చేసే చార్జీలు ఇక్కడ వసూలు చేస్తారు.
  • ఏసీ2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
  • ఏసీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, SLRలలో అందించబడిన డాగ్ బాక్స్‌లలో కుక్కను తీసుకెళ్లే సదుపాయాన్ని అన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్‌, రాజధాని రైళ్లలో ఉంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్, ఏసీ ఫస్ట్ క్లాస్ రెండూ వేర్వేరు క్యాబిన్‌లు/కూపేలను కలిగి ఉంటాయి కాబట్టి ఇతర ప్రయాణికులకు ఇది అసౌకర్యాన్ని కలిగించదు.
  • శతాబ్ది రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లు లేనందున కుక్కల బుకింగ్ కు అనుమతి లేదు.
  • కుక్కలను ముందస్తుగా బుక్ చేసుకునే సదుపాయం లేదు. రైలు బయలు దేరడానికి ఒక గంట ముందు కౌంటర్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దారిలో కుక్కకు ఆహారం అందించే బాధ్యత యాజమాని పైనే ఉంటుంది. వారి ముందరే కుక్కలను పెట్టెల్లో పెట్టి ఎస్ఎల్ఆర్లో ఉంచుతారు.
  • కుక్కల సంఖ్య 36 వరకు ఉంటే ప్రత్యేక వాహనం (గుర్రపు పెట్టెలు) కూడా రైల్వే శాఖ అందిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..