ఉగాది పంచాంగం 2025 : మేషరాశివారి ఉగాది రాశిఫలాలు.. కాస్త కష్టకాలమే!
మేష రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రచయిత ద్రుక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉండటం. మేష రాశి వారికి లాభ స్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం. ఇక మేషరాశి వారికి వ్యయస్థానంలో శని ఏలినాటి శని ప్రారంభ సమయం అవడం చేస్త మేష రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేష రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభం గురుబలం లేకపోవడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో టెన్షన్ తో కూడుకున్నటువంటి పరిస్థితి. ఉద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు ఇబ్బందులు అధికంగా ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఇబ్బందులు తప్పవు. మేషరాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అప్పు చేయొద్దు అప్పు ఇవ్వొద్దు. మీరు కొత్త వ్యాపారాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్త వహించాలి. కొంచెం దూరంగా ఉండడం మంచిది.
మేష రాశి వారికి కుటుంబంలో కొన్ని సమస్యలు అంటేవి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి కనబడుతుంది. మేష రాశి రైతాంగం సినీరంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఆశించిన స్థాయి ఫలితాలు ఉండకపోవచ్చు. మేషరాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. మధ్యస్థ ఫలితాలు మాత్రం ఉన్నాయి. మేషరాశి వారు అప్పులకు దూరంగా ఉండాలి. క్రెడిట్ కార్డు విషయాల్లో లోన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వారికి ధన సహాయం చేయడం తెలియని వారికి అప్పు ఇచ్చేటటువంటి స్థితుల్లో మాత్రం చాలా జాగ్రత్త చేయాలి. కోర్టు విషయాల్లో వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. మేషరాశి రాజకీయ నాయకులకి ఇది అంత అనుకూలమైనటువంటి సంవత్సరం కాదు. మేషరాశి వారి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలంటే దశరథ ప్రవక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తిని నిత్యం పూజించడం శనికి తైలాభిషేకం చేసుకోవడం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.