WITT 2025: అధికారికంగా ప్రారంభమైన టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు
టీవీ9 న్యూస్ నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయిన ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. భారత్ నేడు ఏం ఆలోచిస్తుందో ఈ వేదికగా ప్రధాని మోదీ వెల్లడించారు. గతేడాది నిర్వహించిన కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు. టీవీ9 చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాని అభినందించారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, మనోహర్ లాల్ ఖట్టర్, పీయుష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిషన్‌రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు.
భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ నైన్ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వాట్ ఇండియా థింక్స్ టుడే అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు మూడవ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేశారు. మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు ప్రధాని మోదీకి పూలమాల వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక ఉపన్యాసం చేశారు. ఇది వాట్ ఇండియా థింక్స్ టుడే మూడవ ఎడిషన్.
ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజులు జరగనుంది. ఆలోచనల మహాకుంభమేళాగా అభివర్ణించే ఈ సదస్సులో రాజకీయాల గురించే కాకుండా.. పరిశ్రమలు, క్రీడలు, సినిమాలకు సంబంధించి అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న ఈ సదస్సులో అనేక మంది వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..