ఆ గెలాక్సీలో ఆక్సిజన్! 1,340 కోట్ల కాంతి సం.ల దూరంలో
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువైన ఆక్సిజన్ ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా భావించారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండల గెలాక్సీలో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది!
విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..
టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్
హీరోయిన్ లే.. గీరోయిన్ లే…! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్
TOP 9 ET News: యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
