హీరోయిన్ లే.. గీరోయిన్ లే…! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్
బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న నటి రన్యా రావు కు బిగ్ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. కేసు తీవ్రత, నటికి ఉన్న పలుకుబడిని పరిగణనలోకి తీసుకుని,బెంగళూరులోని 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు రన్యా రావు బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. దీంతో ఆమె మరికొన్ని రోజులు పరప్పన అగ్రహార జైలులో గడపవలసి ఉంటుంది.
రన్యా రావు కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించారని, రన్యారావుకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలను నాశనం చేయడానికి, దర్యాప్తును అడ్డుకోవడానికి దారితీయవచ్చని కోర్టు భావించింది. రన్యారావు ఒక సంవత్సరంలో ఇరవై ఏడు సార్లు విదేశాలకు వెళ్లింది. ముప్పై ఎనిమిది శాతం కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడింది. మొత్తం రూ.4,83,72,694 పన్ను ఎగవేత జరిగింది. బెయిల్ మంజూరు చేస్తే ఆమె దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రభావవంతమైన వ్యక్తుల ప్రమేయం ఉందని, దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంటూ.. బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా
రేసు నుంచి సల్మాన్ ఔట్.. అల్లు అర్జున్‌తో అట్లీ మూవీ..?
Prabhas: ప్రభాస్ పెళ్లి అప్డేట్.. రియాక్ట్ అయిన రెబల్ స్టార్