Rashmika Mandanna: చేసింది తక్కువ సినిమాలే .. కానీ కోట్లు కూడబెట్టిన రష్మిక.. స్టార్ హీరోల వల్ల కూడా కాలేదుగా
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. అటు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ఛావా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఒక్కో సినిమాకు ఆమె 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటోందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలోనే రష్మిక ఆస్తులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రష్మిక మందన్న ఆస్తుల విలువ 66 కోట్ల రూపాయలన్నది సోషల్ మీడియా పోస్ట్ సారాంశం. త్వరలోనే అది 100 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రష్మికకు బెంగళూరు , కూర్గ్, హైదరాబాద్, గోవాతో పాటు ముంబైలో సొంత ఇళ్లు ఉన్నాయట. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలంటే ఫస్ట్ ఛాయిస్ రష్మికనే కనిపిస్తోంది. ఆమెకున్న క్రేజ్ తో వస్తున్న వరుస అవకాశాలు, భారీ హిట్లతో రష్మిక ఆస్తులు కూడా బాగానే కూడబెడుతోందట. సినిమాలతో పాటు యాడ్స్, ఎండార్స్‌మెంట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్లతోనూ రష్మిక భారీగానే సంపాదిస్తోందని టాక్ వినిపిస్తోంది. పలు సంస్థలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రష్మిక ప్లం వంటి బ్రాండ్‌లో పెట్టుబడి కూడా పెట్టింది. హై-ఎండ్ ఆటోమొబైల్స్ పిచ్చి ఉన్న రష్మిక దగ్గర ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతిపై..
భర్త సొమ్ముతో ప్రియుడితో కలిసి బెట్టింగులు.. చివరికి..
రేషన్‌కార్డుదారులకు.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్నిరోజులంటే..?
Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
