భర్త సొమ్ముతో ప్రియుడితో కలిసి బెట్టింగులు.. చివరికి..
ఇటీవల ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్‌తో సమాధి చేసి, ప్రియుడితో విహారయాత్రకు వెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ సొమ్ముతో బెట్టింగ్ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు పోలీసు వర్గాల సమాచారం. విదేశాలకు వెళ్లిన సౌరభ్.. తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్‌లో పడగానే ముస్కాన్ ఆ విషయాన్ని ప్రియుడికి చేరవేసేదట. ఆ డబ్బుతో సాహిల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టేవాడని పోలీసువర్గాలు పేర్కొన్నాయి. అక్కడ వచ్చిన డబ్బుతో వీరిద్దరూ పలు ప్రాంతాలకు ట్రిప్‌లకు వెళ్లినట్లు తెలిసింది. సాహిల్‌కు ఎలాంటి ఉద్యోగం లేదని, గ్యాంబ్లింగ్‌లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. కాగా.. సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 22న ముస్కాన్ స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుంది… ఆ తర్వాత ఓ ఖాళీ ప్రిస్క్రిప్షన్ పేపర్‌ను సంపాదించి అందులో ఆ మందులు రాసింది. వాటితో పాటు నిద్ర మాత్రల గురించి ఆన్‌లైన్‌లో తెలుసుకొని ఆ పేర్లను చేర్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేషన్‌కార్డుదారులకు.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్నిరోజులంటే..?
Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
Ram Charan: దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్ బిగ్ సర్‌ప్రైజ్
TOP 9 ET News: డబుల్ కా మీటా! ఇది కదా బర్త్ డే బంప్స్ అంటే!

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
