రేసు నుంచి సల్మాన్ ఔట్.. అల్లు అర్జున్‌తో అట్లీ మూవీ..?
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. ఆయన సినిమాలన్నీ హిట్ కొడుతుండటంతో చాలా మంది స్టార్ హీరోలు అట్లీతో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో ఆయన సినిమా చేయబోతున్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. అయితే దీనిపై సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.
అట్లీతో ఇప్పట్లో మూవీ చేయడం లేదని స్పష్టం చేశారు. అది భారీ బడ్జెట్ సినిమా అని అందుకే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని చెప్పారు. కానీ భవిష్యత్తులో కచ్చితంగా అట్లీతో సినిమా ఉంటుందని అన్నారు. సల్మాన్ ఖాన్ ప్రకటనతో బన్నీ అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. సల్మాన్ ఖాన్ తో ప్రస్తుతం సినిమా లేనందున అట్లీ – అల్లు అర్జున్ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి బన్నీ పుష్ప తర్వాత త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది. అయితే అది భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ కావడంతో మూవీ పట్టాలెక్కేందుకు ఇంకా టైం పట్టే ఛాన్సుంది. ఈ గ్యాప్లో అట్లీతో మూవీ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం. అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు ఇప్పటికే కథ ఓకే అయిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉగాది రోజున దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్సుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే పాన్ ఇండియా రేంజ్ లో మరో హిట్ పక్కా అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ పెళ్లి అప్డేట్.. రియాక్ట్ అయిన రెబల్ స్టార్