టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలోనే పరిస్థితి విషమించడంతో సత్యవతి తుది శ్వాస విడిచారు. దీంతో మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ మెహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇక సత్యవతి మరణ వార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు. దర్శకులు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి మరణ వార్త తీవ్ర బాధాకరమని.. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ఓ లేఖ రిలీజ్ చేశారు పవన్. అంతేకాదు తన చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని.. చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు పవన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్ లే.. గీరోయిన్ లే…! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్
TOP 9 ET News: యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా
రేసు నుంచి సల్మాన్ ఔట్.. అల్లు అర్జున్‌తో అట్లీ మూవీ..?
Prabhas: ప్రభాస్ పెళ్లి అప్డేట్.. రియాక్ట్ అయిన రెబల్ స్టార్

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
