Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది పంచాంగం 2025 : మిథున రాశివారి ఫలితాలు! వీడియో

ఉగాది పంచాంగం 2025 : మిథున రాశివారి ఫలితాలు! వీడియో

Samatha J

|

Updated on: Mar 29, 2025 | 7:37 AM

మిథున రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైన గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి అనుకూలంగా ఉండటం. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం దశమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యంలో రాహువు తృతీయంలో కేతువు సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి జన్మ గురువు ప్రభావం వల్ల టెన్షన్లు, ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. ఏ పని చేసిన ఆ పని ఆలస్యం అవ్వడం, ఆ పనిలో చికాకులు కలగడం, ఏదో ఒక చోట అది ఆగిపోయేటటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతోంది. మిథున రాశి వారు టెన్షన్లకి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి.

మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది. అయితే మిథున రాశి వారికి శని కొంత అనుకూలంగా ఉండటం, రాహు కేతువుల అనుకూల ప్రభావం చేత శుభకార్యాల్లో పాలుగోవడం, కొన్ని ముఖ్యమైన పనులకు ధనాన్ని ఖర్చు చేసేటటువంటి స్థితి కనబడుతోంది. మిథున రాశి నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు ఉంటాయి. అయినా కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మిథున రాశి వారు ఉద్యోగస్తులు టెన్షన్లకు మాత్రం పనిలో ఒత్తిళ్లకు మాత్రం ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్త వహించడం మంచిది. ఇక మిథున రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా ఆశించిన స్థాయి ధన లాభం లేకపోయినప్పటికీ నష్టం ఉండదు. మిథున రాశి రైతాంగం, సినీరంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. మిథున రాశి స్త్రీలు జాగ్రత్త పడాల్సినటువంటి సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరం. మిథున రాశి వారికి కుటుంబపరంగా ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు మౌనం వ్యాఖ్యానం అనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దత్తాత్రేయుడిని పూజించడం, ఆలయాల్లో సెనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి పంచి పెట్టడం వంటివి చేయడం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.