ఉగాది పంచాంగం 2025 : సింహ రాశివారి ఫలితాలు! వీడియో
సింహ రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతువు కళత్ర స్థానంలో రాహువు సంచారం. సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని అష్టమ శని ప్రభావం ఉండటం. అయితే సింహరాశికి లాభ స్థానంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వివాహం అయినటువంటి వారికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు మనస్పర్థలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. వివాహం కానటువంటి వారికి కుటుంబంలో ఏదో ఒక వాదన ఏదో ఒక సమస్య ఇబ్బందులు మాత్రం కొంత కలిగిస్తాయి. జన్మరాశిలో కేతువు ప్రభావం చేత తలపోట్లు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు మాత్రం కొంత ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
సింహరాశి వారికి పనులన్నీ దగ్గరగా వచ్చి ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఉన్నది. అష్టమ శని ప్రభావం చేత సింహరాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. సింహరాశి వారి సంవత్సరం ఆరోగ్యము గొడవలు అలాగే కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీకు గ్రహస్థితి కొంత అంత అనుకూలంగా లేదు. సింహరాశి ఉద్యోగస్తులకు ఇది కొంచెం కష్ట సమయం ఉద్యోగంలో ఉత్తిళ్లు ఇబ్బందులు రాజకీయ సమస్యలు ఉంటాయి. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. ఆశించిన స్థాయి లాభాలు ఉండవు. కొంచెం నష్టాలతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉండొచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడం అనుకున్న పని దగ్గరికి వచ్చి ఆగిపోవడం పనులు పట్టుకోవడంలో కూడా ఇబ్బంది పడడం అంటూ కొంత ఈ సంవత్సరం సింహరాశికి కనబడుతున్నాయి. సింహరాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారు ఏ పని చేసినా ప్రశాంతంగా ఉండి చేయడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి విద్యార్థులకు ఇది కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. సింహరాశి స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు ఉన్నటువంటి సంవత్సరం. సింహరాశి రైతాంగం సినీరంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి.

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
