UI Movie OTT: ఓటీటీలోకి వస్తోన్న ఉపేంద్ర సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కన్నడ చిత్రపరిశ్రమలో విభిన్నమైన చిత్రాలు..వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఉపేంద్ర. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. చాలా కాలం గ్యాప్ తర్వాత యూఐ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది..

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ యూఐ. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఆయన.. చాలా కాలం గ్యాప్ తీసుకుని ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాతో అడియన్స్ ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈసినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఉపేంద్ర దర్శకత్వం వహించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఉపేంద్ర. దాదాపు రూ.80 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కేవలం రూ.47 కోట్లు మాత్రమే రాబట్టింది. థియేటర్లలో విడుదలైన చాలా కాలానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. అటు ఓటీటీతోపాటు ఇటు టీవీలోనూ ఒకేసారి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ నెట్ వర్క్.. టీవీ ప్రీమియర్ హక్కులను జీకన్నడ ఛానల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఉగాది పండగ సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో టెలికాస్ట్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టాలీవుడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మాదిరిగానే యూఐ సినిమాను సైతం అటు ఓటీటీతోపాటు.. ఇటు టీవీల్లోనూ ఒకేసారి తీసుకువస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
కథ విషయానికి వస్తే.. ఉపేంద్ర దర్శకత్వం వహించిన యూఐ సినిమా థియేటర్లలో విడుదల కాగా.. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తూ జనాలు వింతగా ప్రవర్తిస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళిశర్మ) సైతం ఈ సినిమా రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో స్టోరీ గురించి తెలుసుకోవడానికి ఉపేంద్ర ఇంటికి వెళ్తారు. ఉపేంద్ర రాసిన కథేంటీ..? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే యూఐ చూడాల్సిందే.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..