Viral video: అరెరె.. ఎవరీ అమ్మాయి? ఒక్క వీడియోతో ఓవర్ నైట్‌ స్టార్‌ అయిపోయిందిగా..

ఈ మధ్యకాలంలో కొందరు సోషల్‌ మీడియాలో వీడియోలు చేసి ఓవర్‌ నైట్‌లో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌ ఇలా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో..

Viral video: అరెరె.. ఎవరీ అమ్మాయి? ఒక్క వీడియోతో ఓవర్ నైట్‌ స్టార్‌ అయిపోయిందిగా..
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2023 | 5:03 PM

ఈ మధ్యకాలంలో కొందరు సోషల్‌ మీడియాలో వీడియోలు చేసి ఓవర్‌ నైట్‌లో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌ ఇలా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమదైన శైలిలో డ్యాన్సులు ఇరగదీస్తున్నారు. వీటిల్లో చాలా వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియోలు పోస్టు చేసిన కేవలం గంటల వ్యవధిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అక్రితి అగర్వాల్ అనే అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో అక్రితి అగర్వాల్ వైట్‌ డ్రెస్‌లో బాలీవుడ్ సూపర్‌హిట్ సాంగ్‌ ‘మౌసమ్ బీమాన్ హువా ఆజ్ పెహ్లీ బార్..’ అనే పాటకు డ్యాన్స్‌ చేయడం కనిపిస్తుంది. సాయంకాలం వేళ సముద్రం ఒడ్డున అక్రితి అగర్వాల్ హాట్‌ డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఆమె అందం, డ్యాన్స్‌ చేసిన విధానాన్ని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఈ పాటకు తెరపై సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్‌ నటించారు. కాగా కొన్ని రోజుల క్రితం మరో బాలీవుడ్ హిట్ సాంగ్‌ ‘షరారా షరారా’కు ఓ యువతి చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.