AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అన్నోయ్‌.. నీ ట్యాలెంట్‌ అదుర్స్‌! డ్రైవింగ్‌ ఎక్కడ నేర్చుకున్నావ్‌.. ‘ముందు టైర్లు గాల్లో ‘

రోడ్లపై బైకులు, కార్లతో రకరకాల స్టంటులు చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. ఒక్కోసారి బెడిసికొట్టి బొక్కబోర్లాపడి నడుం విరగగొట్టుకుంటుంటారు కూడా. అలా స్టంట్‌ చేయబోయాడో.. లేదా ఆ టైంకి విధి చిన్నచూపు చూసిందో తెలియదు గానీ..

Viral Video: అన్నోయ్‌.. నీ ట్యాలెంట్‌ అదుర్స్‌! డ్రైవింగ్‌ ఎక్కడ నేర్చుకున్నావ్‌.. 'ముందు టైర్లు గాల్లో '
Overloaded Tractor Video
Srilakshmi C
|

Updated on: Mar 14, 2023 | 6:59 PM

Share

రోడ్లపై బైకులు, కార్లతో రకరకాల స్టంటులు చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. ఒక్కోసారి బెడిసికొట్టి బొక్కబోర్లాపడి నడుం విరగగొట్టుకుంటుంటారు కూడా. అలా స్టంట్‌ చేయబోయాడో.. లేదా ఆ టైంకి విధి చిన్నచూపు చూసిందో తెలియదు గానీ.. రోడ్డుపై వెళ్లే వారంతా ఓ క్షణం ఆగిమరీ ఇతగాడి డ్రైవింగ్‌ స్కిల్‌ను కళ్లప్పగించి చూస్తున్నారు. మరికొందరు చూస్తే సరిపోదనుకున్నారేమో వీడియో కూడా తీసుకుని వెళ్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేసుకోండి..

చెరకు గడలతో ఓవర్‌లోడ్ చేసిన ఓ ట్రాక్టర్ నడిరోడ్డుపై రావడం ఈ వీడియోలో కనిపిస్తుంది. కాస్త దగ్గరగా చూడగా ట్రాక్టర్‌ ముందున్న రెండు చక్రాలు నిటారుగా లేచి గాలిలో నిలబడి ఉంటాయి. దాని వెనుకున్న రెండు చక్రాలతో ఏ మాత్రం బెదరు లేకుండా ఓ యువకుడు డ్రైవింగ్‌ చేస్తుంటాడు. అది నిజంగా ఓవర్‌లోడయ్యి లేచిందో.. లేదా స్టంట్‌ ఏదైనా చేస్తున్నాడో తెలియక ఆ రోడ్డుపై వెళ్తున్న తోటి వాహనదారులు తికమకపడిపోవడం కనిపిస్తుంది. ఇలాంటివి ఇండియాలోనే కనిపిస్తాయనే క్యాప్షన్‌తో మోటర్‌ ఓక్టనె అనే యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు లక్షల వీక్షణలు, వేలల్లో కామెంట్లు రావడంతో అదికాస్తా నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇలాంటి స్టంట్‌లను అస్సలు ప్రోత్సహించవద్దంటూ కొందరు, ఓవర్‌లోడ్‌ అయిన ట్రాక్టర్ భద్రత రిత్యా చాలా ప్రమాదకరమని, ఇతర వాహనాలకు ముప్పు కలిగిస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మీరేమంటారు..?

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.