Man Kills Wife: అసభ్యంగా దుస్తులు ధరించిందని భార్యను హత్య చేసిన భర్త

అసభ్యంగా దుస్తులు ధరించి పబ్లిక్‌ ప్లేస్‌లో తిరిగిందని భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఎన్ని సార్లు చెప్పినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో విసిగి ఆమెను..

Man Kills Wife: అసభ్యంగా దుస్తులు ధరించిందని భార్యను హత్య చేసిన భర్త
Man Kills Wife
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2023 | 5:24 PM

అసభ్యంగా దుస్తులు ధరించి పబ్లిక్‌ ప్లేస్‌లో తిరిగిందని భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఎన్ని సార్లు చెప్పినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో విసిగి ఆమెను హత్య చేసినట్లు తెలిపారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లోని బార్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాజీపూర్ గ్రామానికి చెందిన మోహిత్‌ కుమార్, సప్నా (28) దంపతులు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మోహిత్‌ కుమార్ తరచూ భార్య వస్త్రధారణపై గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా వీరి మధ్య మరోమారు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన మోహిత్‌ కుమార్ కోపంతో పదునైన ఆయుధంతో సప్నా మెడపై దాడి చేశాడు. ఈ సంఘటనలో సప్నా అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగుపొరుగు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. రక్తం మడుగులో అచేతనంగా పడి ఉన్న భార్య మృతదేహం పక్కన మోహిత్‌ కుమార్ కూర్చుని ఉన్నాడు.

అసభ్యంగా వస్త్రాలు ధరించి పబ్లిక్‌ ప్లేస్‌లో తిరగవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన భార్య పట్టించుకోవట్లేదని, అందుకే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మోహిత్ కుమార్ ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టినట్లు సర్కిల్ ఆఫీసర్ సర్జనా సింగ్ మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.