TSPSC: టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ కంప్యూటర్లు హ్యాక్‌.. ఆ రెండు పరీక్షలు వాయిదా.. ఇద్దరు అరెస్ట్!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కంప్యూటర్లు హ్యాక్‌ అయిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్స్ హ్యాక్ అయ్యాయి. పేపర్స్‌ హ్యాక్‌..

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ కంప్యూటర్లు హ్యాక్‌.. ఆ రెండు పరీక్షలు వాయిదా.. ఇద్దరు అరెస్ట్!
TSPSC computers hacked
Follow us

|

Updated on: Mar 12, 2023 | 1:29 PM

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కంప్యూటర్లు హ్యాక్‌ అయిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్స్ హ్యాక్ అయ్యాయి. పేపర్స్‌ హ్యాక్‌ వ్యవహారంపై కమిషన్‌ అధికారులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను బేగం బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీఎస్పీయస్సీ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీలకమైన హోదాల్లో ఉన్న అధికారుల వద్ద లాగిన్ వివరాలు ఉంటాయి. ఈ విషయాలు ఎలా లీక్‌ అయ్యాయి.. ఎవరు లాగిన్ అయ్యారు.. ఎందుకు అయ్యారు.. ఏ సమాచారం చోరీ చేశారు అనే దిశగా పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా టీఎస్‌పీఎస్సీలోని కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్యమైన సమాచారం లీక్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు పరీక్షలు వాయిదా వేశారు. నేడు జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష కూడా వాయిదా వేశారు. మార్చి 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్ష సైతం వాయిదా వేసినట్లు టీఎస్పీయస్సీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను త్వరల ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..