Hyderabad: వాషింగ్ పౌడర్ నిర్మా.. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో హోర్డింగ్‌ల కలకలం..
హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో నగరంలో వెలిసిన పోస్టర్స్.. కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్ పౌడర్ నిర్మా..వెల్‌కమ్ టు అమిత్‌షా అంటూ..
హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో నగరంలో వెలిసిన పోస్టర్స్.. కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్ పౌడర్ నిర్మా..వెల్‌కమ్ టు అమిత్‌షా అంటూ..హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రాణె, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతల ఫొటోలతో పోస్టర్లు పెట్టారు. బీజేపీలో చేరితే మరకలు పోతాయని అర్థం వచ్చేలా..హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.
మరోవైపు నిన్న కవిత ఈడీ విచారణకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు BRS శ్రేణులు. బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆందోళనలు నిర్వహించారు. రాజ్‌భవన్ గోడకు ఫిర్యాదు కాపీని అంటించారు.
ఇక నిన్న ఢిల్లీలో బైబై మోదీ అంటూ పోస్టర్లు ఏర్పాటుచేశారు. బీజేపీలో చేరగానే కేసులు మాయమంటూ..ఇటీవల బీజేపీలో చేరిన పలువురి ఫొటోలను ప్రదర్శించారు. బీజేపీలో చేరితే అవినీతి మరకలు కాషాయంలోకి మారిపోతాయని..అలాగే కవిత ఫొటోపై ట్రూ కలర్స్ నెవర్ అంటూ కామెంట్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..