- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Kaniha suffers an ankle fracture; photo viral on social media
నడవలేని స్థితిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ అవుతోన్న ఫొటోలు
హీరో శ్రీకాంత్, నటి కనిహ జంటగా నటించిన ‘ఒట్టేసి చెపుతున్నా’ సినిమా గుర్తుండే ఉంటుంది. తొలి సినిమాతోనే కనిహ ఎంతో ఆకట్టుకుంది..
Updated on: Mar 12, 2023 | 11:33 AM

హీరో శ్రీకాంత్, నటి కనిహ జంటగా నటించిన ‘ఒట్టేసి చెపుతున్నా’ సినిమా గుర్తుండే ఉంటుంది. తొలి సినిమాతోనే కనిహ ఎంతో ఆకట్టుకుంది.

తమిళనాడుకు చెందిన నటి కనిహ అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. తన కెరీర్‌లో చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది.

2008లో పెళ్లి తర్వాత నటనకు దూరం అయ్యింది కనిహ. ప్రస్తుతం మలయాళ మువీల్లో నటిస్తోంది.

కనిహ సోషల్ మీడియలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత, కెరీర్ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

తాజాగా కనిహ కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో నడలేని స్థితిలో ఉంది. వాకర్ పట్టుకొని ఉన్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. కొత్త బూట్లతో బ్యాలెన్సింగ్‌గా నడపవడం నేర్చుకుంటున్నా అంటూ తన పోస్టులో తెల్పింది.




