Guinness World Records: ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ ఇది.. ఇప్పుడు గిన్నిస్ రికార్డులో చోటు దక్కింది..
ప్రధాన నిర్మాణంతో పాటు స్టేషన్ కు మూడో ప్రవేశ ద్వారం కూడా నిర్మించారు. గతంలో ఈ స్టేషన్ కు రెండు ఎంట్రెన్స్, ఎగ్జిట్ ద్వారాలు ఉండేవి. ఈ ప్లాట్‌ఫారమ్ లో ఒకే సారి
కర్నాటకలోని హుబ్బళ్లి రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పేరుపై నమోదై ఉంది. ఆ స్టేషన్ 1,366 మీటర్ల పొడవైన ప్లాట్ ఫామ్ ను కలిగి ఉంది. అయితే ఆ రికార్డును హుబ్బళ్లి రైల్వేస్టేషన్ అధిగమించింది. ఇటీవల 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్ ను ఈ స్టేషన్ లో నిర్మించారు. ఇది గత ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. జనవరి 12న ప్లాట్‌ఫారమ్ పొడవును ధృవీకరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ రైల్వే ప్లాట్ ఫామ్ ను శ్రీ సిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్‌గా పిలుస్తున్నారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 1507 మీటర్ల పొడవులో ప్లాట్ ఫాంను నిర్మించారు. కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్ ప్రాంతంలో భవిష్యత్తులో మరిన్ని రైళ్ల అవసరాన్ని తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది .
పునరుద్ధరించిన హుబ్బళ్లి ప్లాట్ ఫాం రెండు వైపుల నుండి రైళ్లను పంపడానికి వీలు కల్పిస్తుంది. ప్రధాన నిర్మాణంతో పాటు స్టేషన్ కు మూడో ప్రవేశ ద్వారం కూడా నిర్మించారు. గతంలో ఈ స్టేషన్ కు రెండు ఎంట్రెన్స్, ఎగ్జిట్ ద్వారాలు ఉండేవి. ఈ ప్లాట్‌ఫారమ్ లో ఒకే సారి రెండు దిక్కుల నుంచి రెండు రైళ్లు రాకపోకలు సాగించవచ్చని దక్షిణ రైల్వే తెలిపింది.
ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడం కోసం హోసపేట-హుబ్బల్లి-తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ, హోసపేట స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్‌ను కూడా ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌పై అతుకులు లేని రైలు ఆపరేషన్‌ను ఏర్పాటు చేస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన మరియు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి స్మారక చిహ్నాలను తలపించేలా దీన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..