Indian Railways: ట్రైన్‌లో అరాచకం.. ప్రయాణికురాలి తలపై మూత్ర పోసిన టీటీ..
ఇప్పటి వరకు విమానంలో ప్రయాణికులపై సహ ప్రయాణికులు మూత్రం పోసిన వార్తలు విన్నాం.. బస్సులో ప్రయాణికులపై..
ఇప్పటి వరకు విమానంలో ప్రయాణికులపై సహ ప్రయాణికులు మూత్రం పోసిన వార్తలు విన్నాం.. బస్సులో ప్రయాణికులపై టాయిలెట్ చేసిన వార్తలు కూడా చూశాం. ఇప్పుడు మరో దారుణం వెలుగు చూసింది. ఈసారి ట్రైన్ వంతు వచ్చినట్లుంది. అదీ కూడా ప్రయాణికుడు చేసిన అరాచకం కాదు.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఫుల్లుగా మద్యం సేవించిన టీటీ.. ఓ ప్రయాణికురాలి తలపై మూత్రం పోశాడు. ఈ ఘటన అమృత్ సర్, కోల్‌కతా మధ్య అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది.
అకాల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎ-1 కోచ్‌లో తన భార్యతో కలిసి అమృత్‌సర్ నివాసి రాజేష్ ప్రయాణిస్తున్నాడు. రాత్రి అందరూ నిద్రపోతుండగా.. ఇంతలో టీటీ మున్నా కుమార్ వచ్చాడు. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగిన టీటీ.. బెర్త్‌పై పడుకున్న మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేశాడు. వెంటనే అలర్ట్ అయిన ఆమె.. విషయాన్ని ఆమె భర్తకు తెలియజేయగా, అతను టీటీని పట్టుకున్నాడు. ట్రైన్ అలారం రైజ్ జీఆర్పీకి కంప్లైంట్ చేశారు. రైల్వే పోలీసులు కంప్లైంట్ తీసుకుని టీటీని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Zero tolerance. Removal from service with immediate effect. https://t.co/NPqUXFtVbY pic.twitter.com/nXRn9JpPUx
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 14, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..