AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కానింగ్ మిషన్స్ కూడా కనిపెట్టకుండా కనికట్టు చేసింది.. లోదుస్తుల్లో దాచి అడ్డంగా దొరికిపోయిన మహిళ..

అదొక రద్దీగా అంతర్జాతీయ విమానాశ్రయం.. రోజూ వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు దేశ, విదేశాలకు ప్రయాణాలు సాగిస్తుంటాయి.

స్కానింగ్ మిషన్స్ కూడా కనిపెట్టకుండా కనికట్టు చేసింది.. లోదుస్తుల్లో దాచి అడ్డంగా దొరికిపోయిన మహిళ..
Airport
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2023 | 8:50 PM

Share

అదొక రద్దీగా అంతర్జాతీయ విమానాశ్రయం.. రోజూ వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు దేశ, విదేశాలకు ప్రయాణాలు సాగిస్తుంటాయి. అలాంటి విమానాశ్రయంలో ఓ మహిళ.. ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అయితే, మొదట అధికారులు లైట్ తీసుకున్నారు. ఆమె నడకలో తేడా కనిపించడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఆమెను ముందు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె లగేజీని కూడా చెక్ చేశారు. కానీ ఏం కనిపించలేదు.. అంతా మంచిగానే ఉంది.. ఆమెను స్కానర్ ద్వారా కూడా చెక్ చేశారు. ఏం కనిపించలేదు.. చివరకు లోదుస్తులను చెక్ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె లోదుస్తుల నుంచి రూ.కోటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ సీన్ కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

కోజికోడ్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లోదుస్తుల్లో ఉంచి రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 32 ఏళ్ల మహిళను కరీపూర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కోజికోడ్‌లోని నరిక్కున్నిలోని కందన్‌ప్లాకిల్‌కు చెందిన అస్మాబీవి (32) ని మొదట అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఆమె లోదుస్తుల్లో దాచుకున్న 1.769 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన అస్మాబీవిని కోజికోడ్ ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. 2,031 గ్రాముల బంగారు ముద్దతో కూడిన రెండు ప్యాకెట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 1.769 కిలోల బంగారం ఉందని.. ఈ బంగారం విలువ రూ.99.68 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!