Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడి నిశ్చితార్ధం.. కాబోయే కోడలు ఎవరో తెలుసా?

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ అయిన గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా జైమిన్ షాల నిశ్చితార్ధం ఆదివారం (మార్చి 12) జరిగింది. కేవలం అతికొద్దిమంది సన్నిహితులు..

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడి నిశ్చితార్ధం.. కాబోయే కోడలు ఎవరో తెలుసా?
Jeet Adani Engagement
Follow us

|

Updated on: Mar 14, 2023 | 6:02 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ అయిన గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా జైమిన్ షాల నిశ్చితార్ధం ఆదివారం (మార్చి 12) జరిగింది. కేవలం అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. జీత్ కాబోయే భార్య దివా.. సి దినేష్‌ అండ్‌ కో ప్రైవెట్‌ లిమిటెడ్‌కి చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. ఈ కంపెనీ ముంబాయి, సూరత్ ప్రాంతాల్లో ఉంది. వీరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌ నుంచి డిగ్రీ పట్టాపొందిన జీత్‌ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ (గ్రూప్ ఫైనాన్స్) వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. జీత్ అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా చీఫ్ గా వహిస్తున్నారు.

కాగా గౌతమ్ అదానీకి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అయిన కరణ్ అదానీ, సిరిల్ అమర్ చంద్ మంగళదాస్ మేనేజింగ్ పార్ట్నర్‌ అయిన సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాప్‌ను వివాహం చేసుకున్నాడు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా కరణ్ అదానీ వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా విడుదలైన హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్లు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటిరవకు దేశీ స్టాక్‌ మార్కెట్‌లో నెం.1 స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ మూడో స్థానానికి పడిపోయింది. టాటా గ్రూప్‌ కంపెనీ అదానీని వెనక్కి నెట్టి టాప్‌లో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్