Dog Videos: ఈగోని హర్ట్ చేస్తే అంతే..! బంతిని గాల్లోకి ఎగిరి అడ్డుకున్న గోల్ కీపర్.. వీడియోను మీరే చూడండి..
గోల్ కీపర్‌గా చేయడం అంటే అంత సాధారణమైన బాధ్యత కాదు. గోల్ కోసం ప్రత్యర్థి జట్టు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి చాలా వేగంగా..
ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుట్‌బాల్ క్రీడను అభిమానించే క్రీడాభినులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూడకపోయినా, కనీసం అవగాహన ఉన్నా.. ఆటకు గోల్ కీపర్ వెన్నుముక లాంటివాడన్న విషయం అర్థమయిపోతుంది కదా. గోల్ కీపర్‌గా చేయడం అంటే అంత సాధారణమైన బాధ్యత కాదు. గోల్ కోసం ప్రత్యర్థి జట్టు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి చాలా వేగంగా కదులుతుండాలి. ఈ విషయాలు కూడా మనకు తెలిసినవే. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ గోల్ కీపర్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. మొదటి సారి బంతిని ఆపలేకపోయానని, రెండో సారి బంతిని ఆపేందుకు అతను వేసిన అడుగులు ఎంతో ప్రశంసనీయం కూడా. అసలు ఆ గోల్ కీపర్ ఎవరు..? ఆ మ్యాచ్ విషయం ఏంటనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
the_factsworld_ అనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి పోస్ట్ అయిన వీడియోలో.. ఒక పెంపుడు కుక్కపిల్ల తన యజమానితో కలిసి గోల్ ఆడుతుంది. ఆ క్రమంలో ఆ కుక్కపిల్ల గోల్ కీపర్‌గా ఉంది. అయితే దానికి అందకుండా బంతిని కిక్ చేసిన ఓ వ్యక్తి గోల్ చేశాడు. అంతటితో ఆగక అతను సరదాగా సంబరాలు కూడా చేసుకున్నాడు. తన ఈగో హర్ట్ అవ్వడంతో.. ఇక తర్వాతి ప్రయత్నాన్ని ఎలా అయినా అడ్డుకోవాలని నిర్ణయించుకున్న ఆ పెంపుడు కుక్క బంతిని కిక్ చేయకముందే.. ముందుకు జరిగి సిద్ధంగా నిలబడింది. అనంతరం మరో వ్యక్తి బంతిని కిక్ చేయగా.. ఆ కుక్కపిల్ల గాల్లోకి ఎగిరి మరి గోల్ అవకుండా అడ్డుకుంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
కాగా ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు లక్షా 62వేల మందికి పైగా లైక్ చేశారు. ఇంకా దాదాపు 20 లక్షలకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 242 మంది నెటిజన్లు వీడియోను చూసి.. ఆ పెంపుడు కుక్కపిల్ల వేగాన్ని, ఆటతీరును తమ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే పలువురు నెటిజన్లు ‘లైన్ రిఫరీ ఎక్కడా..? బంతిని కిక్ చేయకముందే గోల్ కీపర్ లైన్ కంటే ముందుకు కదులుతున్నాడు’ అంటూ సరదాగా రాసుకొచ్చారు. అలాగే రెండో గోల్‌ను ఆ పెంపుడు కుక్క చాలా సీరియస్‌గా తీసుకుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల ద్వారా వ్యక్తపరుస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.