Watch: గిన్నీస్ రికార్డు కోసం తప్పని తిప్పలు..హెలికాప్టర్ రాడ్డు పట్టుకొని గాలిలో కసరత్తులు…
పుల్-అప్స్ అనేవి చాలా కఠినమైన వ్యాయామం. రోజువారీ వ్యాయామం లేదా జిమ్‌కు వెళ్లేవారు లేదా క్రీడాకారులు మాత్రమే ఈ పుల్ అప్స్ చేయగలరు.

పుల్-అప్స్ అనేవి చాలా కఠినమైన వ్యాయామం. రోజువారీ వ్యాయామం లేదా జిమ్‌కు వెళ్లేవారు లేదా క్రీడాకారులు మాత్రమే ఈ పుల్ అప్స్ చేయగలరు. కానీ ఓ వ్యక్తి గిన్నీస్ రికార్డు కోసం ఏకంగా ఎగిరే హెలికాప్టర్ లాంచింగ్ రాడ్ పట్టుకొని గాల్లో పుల్ అప్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఇంత రిస్కు ఎవరూ తీసుకోరు. అంత ఎత్తు నుంచి కింద పడితే చనిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. వివరాల్లోకి వెళితే, అర్మేనియాకు చెందిన ఒక అథ్లెట్ హెలికాప్టర్ స్కిడ్ పట్టుకుని ఒక నిమిషంలో 32 పుల్-అప్‌లు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వ్యక్తి పేరు హంజాస్ప్ హలోయన్. అర్మేనియా రాజధాని యెరెవాన్‌లో అతను ఈ రికార్డు సృష్టించాడు. హెలికాప్టర్ నుండి వేలాడుతూ ఒక నిమిషంలో అత్యధిక పుల్-అప్‌లను చేసిన తొలి వ్యక్తిగా ఈ రికార్డ్ సృష్టించాడు.




మునుపటి రికార్డు ఇదే:
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం 2022లో బెల్జియన్ అథ్లెట్ స్టాన్ బ్రూనింక్ అకా యూట్యూబర్ స్టాన్ బ్రౌనీ హెలికాప్టర్ రాడ్డు పట్టుకొని వేళాడుతూ 25 పుల్-అప్‌ల రికార్డు నెలకొల్పాడు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. అయితే తాజాగా రికార్డు నమోదు చేసిన అర్మేనియా వ్యక్తి కేవలం 1 నిమిషంలో హెలికాప్టర్ జాక్ పట్టుకొని 32 పుల్ అప్స్ చేయడం సరికొత్త రికార్డుగా నిలిచిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.