Viral Post: ఓరి భగవంతుడా..! ఈ గుండె బరువు 181 కిలోలు.. 3 కి.మీ దూరంలో కూడా హార్ట్ బీట్ శబ్దం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటోను చూస్తే మీకు అనేక ప్రశ్నలు తప్పక కలుగుతాయి. ఎప్పుడూ అద్భుతమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేసే..
ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు బ్లూవేల్ అని మనందరికీ తెలుసు. అయితే దాని గుండె ఎంత పెద్దగా, ఎంత బరువుగా ఉంటుంది..? ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటోను చూస్తే ఈ ప్రశ్నలు మీకు తప్పక కలుగుతాయి. ఎప్పుడూ అద్భుతమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయింకా తాజాగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అదేమిటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అవును, మీరు ఆలోచిస్తున్నదే.. 2017 నుంచి కెనడాలోని రాయల్ అంటారియో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఓ బ్లూవేల్ గుండెకు సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
This is the preserved heart of a blue whale which weighs 181 kg. It measures 1.2 meters wide and 1.5 meters tall and its heartbeat can be heard from more than 3.2 km away. ? ? pic.twitter.com/hutbnfXlnq
ఇవి కూడా చదవండి— Harsh Goenka (@hvgoenka) March 13, 2023
ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇది సంరక్షణలో ఉన్న బ్లూవేల్ గుండె. దీని బరువు 181 కేజీలు. 1.2 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు ఉన్న ఈ గుండె కొట్టుకుంటే దాని శబ్దాన్ని 3.2 కి.మీ దూరం నుంచి అయినా వినవచ్చు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అలాగే జాతీయ వన్యప్రాణి సమాఖ్య నివేదిక ప్రకారం.. నీలి తిమింగలాలు 110 అడుగుల పొడవు, అలాగే 150 టన్నుల బరువు ఉంటాయి. ఇంకా వీటి గుండె విషయానికి వస్తే.. నిముషానికి 4 లేదా 5 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అలాగే ఒక సారి గుండె కొట్టుకుంటే 60 గ్యాలన్ల వరకు రక్తాన్ని పంపింగ్ అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..