Jadeja-Ashwin: వికెట్లను పంచుకుంటున్న టీమిండియా అల్‌రౌండర్లు..! ‘ఏక్ తేరా, ఏక్ మేరా’ అంటూ..
రౌడీ రాథోర్‌లో ‘ఏక్ తేరా, ఏక్ మేరా’ అంటూ అక్షయ్ కుమార్, పరేశ్ గనత్రా నటించారు. ఆ సన్నివేశం తరహాలోనే మన టీమిండియాలోని స్టార్ ఆల్‌రౌండర్లు ఇద్దరు పంపకాలు
విక్రమార్కుడు సినిమాను మీరంతా ఇది వరకే చూసి ఉంటారు. ఇక ఇదే సినిమాను ‘రౌడీ రాథోర్’ పేరుతో అక్షయ్ కుమార్ బాలీవుడ్‌లోకి రిమేక్ చేశాడు. అయితే తెలుగులో రవితేజ, బ్రహ్మానందం మధ్య జరిగిన డబ్బు పంపకాలోకు సంబంధించిన సన్నివేశంలో రౌడీ రాథోర్‌లో ‘ఏక్ తేరా, ఏక్ మేరా’ అంటూ అక్షయ్ కుమార్, పరేశ్ గనత్రా నటించారు. ఆ సన్నివేశం తరహాలోనే మన టీమిండియాలోని స్టార్ ఆల్‌రౌండర్లు ఇద్దరు పంపకాలు జరుపుకున్నారు. అంతేకాక వీడియో చివరిలో ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ కూడా వేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను వారు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయండంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో అటు నెటిజన్లు, ఇటు క్రికెట్ అభిమానులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అవును, ఆస్ట్రేలియతో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సరదాగా జిమ్‌లో గడుపుతున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సరదాగా ‘ఏక్ తేరా, ఏక్ మేరా’ సీన్‌ను రిపీట్ చేశారు.
మరోవైపు ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన వీరిద్దరూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో అశ్విన్ 25 వికెట్లు తీసి 86 పరుగులు చేయగా, జడేజా 22 వికెట్లతో పాటు 135 పరుగులు సాధించాడు. ‘‘#ఆస్కార్ ఎవరికి వెళ్తుందంటే.. వీడియో క్రెడిట్స్ నా వాతి కమింగ్ రీల్ ఫేమ్‌లో ఉన్న సోహన్ దాస్‌కి వెళ్లాయి’’ అంటూ రవిచంద్రన్ అశ్విన్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ చేస్తూ క్యాప్షన్ రాశాడు. నిన్న షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 64 లక్షలకు పైమంది వీక్షించారు. అలాగే సుమారు 13 లక్షల 13వేల లైకులు వచ్చాయి కూడా. ఇంకా 6, 200 మందికి పైగా నెటిజన్లు కామెంట్లు చేశారు.
అశ్విన్, రవీంద్ర వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఇక ఈ వీడియోను చూసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్.. ఇంకా పలువురు పలువురు సెలబ్రిటీలు లాఫింగ్ ఎమోజీలను పెట్టి వదిలేశారు. మరోవైపు టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘డెడ్లీ కాంబో’ అంటూ కామెంట్ చేాశాడు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ల కోసం ప్లాన్ వేసుకుంటున్నారా..? ఎందుకంటే ఇటీవలి టెస్టు సిరీస్‌లో అలాగే చేశారు కదా..’ అంటూ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా వికెట్లను కూడా అలాగే పంచుకోండి..’ అని రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..