Dance Video: ఏం ఎనర్జీ మేడమ్ ఇది..? డ్యాన్స్‌ స్టెప్పులతో మతిపోగొడుతున్న 53 ఏళ్ల మహిళ.. వైరల్ అవుతున్న వీడియో..

‘నేనేమన్నా తక్కువా..?’ అంటూ నీరూ సైనీ అనే 52 ఏళ్ల మహిళ తన డ్యాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నడివయసులో ఉన్న ఈ మహిళ తన డ్యాన్స్

Dance Video: ఏం ఎనర్జీ మేడమ్ ఇది..? డ్యాన్స్‌ స్టెప్పులతో మతిపోగొడుతున్న 53 ఏళ్ల మహిళ.. వైరల్ అవుతున్న వీడియో..
Neeru Saini Dance Sreps
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 15, 2023 | 12:47 PM

ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా ద్వారా అనేక మంది యువతీయువకులు తమ డబ్‌స్మాష్, డ్యాన్స్ వీడియోలతో ఇట్టే ఫేమస్ అయిపోతున్నారు. అయితే ‘నేనేమన్నా తక్కువా..?’ అంటూ నీరూ సైనీ అనే 53 ఏళ్ల మహిళ తన డ్యాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నడివయసులో ఉన్న ఈ మహిళ తన డ్యాన్స్ వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ.. నెట్టింట హల్‌చల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నీరూ సైనీ తాజాగా ‘పఠాన్’ సినిమాలోని ‘జూమే లే’ మ్యూజిక్‌కు స్టెప్పులేసింది. నడి వయసులోనూ ఆమె వేసిన ఎనర్జెటిక్ స్టెప్పులు చూసిన నెటిజన్లు ఫీదా అయిపోయారంటే మీరు నమ్మలేరేమో..! కానీ ఆమె డ్యాన్స్ వీడియోలను చూస్తే మీరే అనుకుంటరు.. ఈ వయసులో కూడా ఆమె ఎలా ఇంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ వేస్తుందని.

ఛత్తీస్‌ఘడ్‌లో స్పోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్ననీరూ సైనీకు స్వతహాగా డ్యాన్స్ చేయడంలో ప్రత్యేక అభిరుచి ఉంది. అదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అబౌట్‌ ద్వారా తెలిపింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆమె ఖాకీ ప్యాంట్, బ్లాక్ టీ షర్ట్ ధరించి ఏంతో చురుకుగా.. ట్రెండింగ్‌లో ఉన్న జూమే లే మ్యూజిక్‌కు తన కాలిని కదిపింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె డ్యాన్స్, ఇంకా తన ఎనర్జీ లెవెల్స్ చూసి అశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని వారు ఆ వీడియో కింద కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్రెండ్ అవుతున్న నీరూ సైనీ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Neeru Saini (@neerusaini__)

కాగా, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నీరూ సైనీ వీడియోను ఇప్పటివరకు 1 లక్ష 39 వేల మంది వీక్షించారు. అలాగే దాదాపు 9 వేల మంది లైక్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘మీ వయసు ఎంతో కానీ నిరంతరం మీరు యోగా చేస్తూ ఫిట్‌గా ఉన్నారు. ఇంకా అద్భుతంగా డ్యాన్స్ వేస్తున్నారు’ అని కామెంట్ చేశాడు. అందుకు రిప్లై ఇచ్చిన నీరూ సైనీ తన వయసు 53 అని బదులిచ్చింది. అలాగే మరో నెటిజన్ ‘నా జీవితంలో అన్నీ నెగటీవ్ అలోచనలే.. నాకు మీలా పాజిటీవ్‌గా ఉండాలని ఉంది. మీరు ఎలా ఇంత సంతోషంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు..?’ అని ప్రశ్నించింది. ఇంకో నెటిజన్ అయితే ‘మీలా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు ఏంచేయాలి..? ఏమైనా డైట్ ప్లాన్ ఉంటే మాకు కూడా తెలియజేయండ’ని రాసుకొచ్చింది. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలు, స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?