Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: ఈ 5 మసాలాలు వాడితే చాలు.. ఒంట్లో కొవ్వును కత్తిరించే తీసినట్లే.. నో హార్ట్ అటాక్, నో ఒబేసిటీ..!

శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండడమే గుండె పోటు ముఖ్య కారణం. శరీరంలో ఈ కొలెస్ట్రాల్ లేదా కొవ్వు ఉన్న కారణంగానే..

Cholesterol: ఈ 5 మసాలాలు వాడితే చాలు.. ఒంట్లో కొవ్వును కత్తిరించే తీసినట్లే..  నో హార్ట్ అటాక్, నో ఒబేసిటీ..!
Indian Spices
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 14, 2023 | 5:45 PM

ప్రస్తుత మానవ ప్రపంచంలో అధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె పోటు. ఈ సమస్యకు శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండడమే ముఖ్య కారణం. ఇంకా ఈ కొలెస్ట్రాల్ లేదా కొవ్వు కారణంగానే చాలా మంది ఊభకాయం, అధిక బరువు సమస్యలతో కూడా భాధపడుతున్నారు. ఇంకా దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ సహ అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని రకాల మందులు, ఆహారపు అలవాట్లలో, ఇంకా జీవనశైలిలో మార్పులతో అధిక కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకునేందుకు సహాయపడతాయి. ఇంకా ఆ క్రమంలో తగినంగా శారీరక శ్రమ చేయడం కూడా చాలా అవసరం.

అయితే  చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి మన వంటింట్లో ఉండే మసాలా దినుసులు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మన పూర్వీకుల నాటి నుంచి కూడా మసాలా దినుసులను ఆయుర్వేదంలో ప్రముఖంగా ఉపయోగిస్తూ వచ్చారు. మరి మన శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికి ఏయే మసాలు దినుసులు ఉపకరిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దాల్చిన చెక్క: కొలెస్ట్రాల్ తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. సిన్నమాల్డిహైడ్, సిన్నమిక్ యాసిడ్ అనే సమ్మేళనాలను ఇది కలిగి ఉంటుంది. అందువల్ల చెడు కొలెస్ట్రాల్, రక్తంలోని కొవ్వు ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంతే కాక రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచేందుకు కూడా దాల్చిన చెక్క పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు దాల్చిన చెక్క టీ లేదా వంటలలో అయినా దీన్ని తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

అల్లం: గొప్ప ఔషధ గుణాలు కలిగిన అల్లం మసాలా ఘాటుగా ఉండటమే కాదు.. ఎంత కొవ్వునైనా కరిగించేస్తుంది. ఇందులో జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

నల్ల మిరియాలు: నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ నిల్వ ఉండకుండా అడ్డుకుంటుంది. ఇంకా పిత్త ఆమ్లాల స్రావాన్ని పెంచుతుంది. ఆహారం జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్నందున ఫ్రీ రాడిక్సల్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మెంతులు: భారతీయులు తప్పనిసరిగా వంటలలో ఉపయోగించే వాటిలో మెంతులు కూడా ప్రముఖమైనవి. ఇందులో సపోనిన్స్ అనే సమ్మేళనం ఉండడం వల్ల దీనికి కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం ఉంటుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అంతే కాదు మెంతులు జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కడుపులోని మంటలు తగ్గిస్తాయి. ఇది ఆరోగ్యపరంగా మాత్రమే కాదు.. అందానికి జుట్టు సంరక్షణకి కూడా ఉపయోగపడుతుంది. మెంతిపొడి జుట్టుకి పెట్టుకుంటే వెంట్రుకలకు పోషణ లభిస్తుంది.

పసుపు: సంప్రదాయ వైద్యంలో వేళ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న స్పైసెస్ పసుపు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంటని తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలని కంట్రోల్ లో ఉంచుకుంటుంది. కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా చేయడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..