Nokia C12: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. రూ. 5,999లకే 6జీబీ ర్యామ్.. పూర్తి వివరాలివే..

యూరోపియన్ మార్కెట్‌లో విడుదలై హిట్ టాక్ పొందిన నోకియా సీ12 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చేసింది. మన దేశంలో మార్చి 17 నుంచి

Nokia C12: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. రూ. 5,999లకే 6జీబీ ర్యామ్.. పూర్తి వివరాలివే..
Nokia C12
Follow us

|

Updated on: Mar 14, 2023 | 4:30 PM

నోకియా అభిమానులకు శుభవార్త. భారత మార్కెట్‌లోకి నోకియా ఇండియా మరో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. అవును, ఈ ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్‌లో విడుదలై హిట్ టాక్ పొందిన నోకియా సీ12 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చేసింది. మన దేశంలో మార్చి 17 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనున్న ఈ ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ కోసం మీరు కేవలం రూ.5,999 చెలిస్తే చాలు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2జీబీ అడిషనల్ ర్యామ్, భారీ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా సెన్సార్, ఆక్టాకోర్ యూనిసోక్ 9863A1 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అసలు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఏయే ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నోకియా సీ12 స్పెసిఫికేషన్లు:

మార్చి 17 నుంచి అందుబాటులోకి రానున్న ఈ నోకియా సీ12.. ఆండ్రాయిడ్ 12 తో పనిచేస్తుంది. ఇంకా రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, 6.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ స్టైల్ కట్‌అవుట్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ 9863A 1 ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, 4జీబీ వరకు ర్యామ్‌ పెంచుకునే అవకాశం, 8 ఎంపీ రియర్ కెమెరా, ఆటోఫోకస్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీ, ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ నోకియా సీ12లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 5వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా కలర్ విషయానికి వస్తే.. కార్కోల్, డార్క్ సియాన్, లైట్ మింట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఫోన్ అమెజాన్‌‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles