Oppo Foldable phone: ఈ ఫ్లిప్ ఫోన్ చూశారా? ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్(Oppo Find N2 Flip)పేరుతో మన దేశంలో విడుదల చేసింది. దీనిపై లాంచింగ్ ఆఫర్ కింద దాదాపు రూ. 5,000 తగ్గింపును ఒప్పో అందిస్తోంది.

మనిషికి ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక అత్యవసరం. అది లేనిదే రోజు గడవదు. మార్కెట్లో ఈ డిమాండ్కు అనుగుణంగా అన్ని కంపెనీలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయ లుక్, అద్భుత ఫీచర్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్(Oppo Find N2 Flip)పేరుతో మన దేశంలో విడుదల చేసింది. ఇది స్పోర్ట్స్ క్లామ్షెల్ డిజైన్ లో ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్, వెనుకవైపు మ్యాట్ గ్లాస్ తో వస్తుంది. దీనిపై లాంచింగ్ ఆఫర్ కింద దాదాపు రూ. 5,000 తగ్గింపును ఒప్పో అందిస్తోంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి..
ధర, ఆఫర్లు ఇలా..
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ప్రారంభ సేల్ కింద కొన్ని ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఆ ఆఫర్లేంటో ఓసారి చూద్దాం..
- వినియోగదారులు హెచ్ డీ ఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెడీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ అండ్ అమెక్స్ వంటి కార్డులపై తొమ్మిది నెలల నోకాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే రూ. 5,000 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.
- లాయల్ ఒప్పో వినియోగదారులకు ఎక్స్చేంజ్ తో పాట లాయల్టీ బోనస్ కింద రూ. 5000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఒప్పో పాత ఒప్పో ఫోన్ ఎక్స్ చేంజ్ పై రూ. 2000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
- హెడీబీ ఫైనాన్స్ వారి పేపర్ ఈఎంఐ స్కీమ్స్ పై రూ. 5,000 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
స్పెసిఫికేషన్లు ఇలా..
ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ స్పోర్ట్స్ లోని ప్రధాన స్క్రీన్ లో 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 1080*2520 పిక్సల్ రిజల్యూషన్ ఉంటుంది. దీనిలో 120 Hz రిఫ్రెష్ మెంట్ రేట్, 1600 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. దీని డిస్ ప్టేను సంరక్షించడానికి యూటీజీ గ్లాస్ ఉంటుంది. అలాగే 3.26 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 720*382 పిక్సల్ రిజల్యూషన్ తో ఉంటుంది. దీని సంరక్షణకు గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది.



దీనిలో ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజి సామర్థ్యంతో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీనిలో వెనుక వైపు 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. దీనిలో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 44వాట్స్ సామర్థ్యంతో ఫ్లాష్ చార్జ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 89,999 వరకూ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..