Shukra-Rahu Yuti: మేషరాశిలో శుక్ర-రాహు కలయిక.. ఈ 3 రాశులవారికి ఆకస్మిక ధనలాభం, పురోగతి..

జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు, గ్రహ సంయోగాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. అయితే రెండు రోజుల కిందటే శుక్రుడు..

Shukra-Rahu Yuti: మేషరాశిలో శుక్ర-రాహు కలయిక.. ఈ 3 రాశులవారికి ఆకస్మిక ధనలాభం, పురోగతి..
Shukra Rahu Yuti
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 14, 2023 | 5:16 PM

ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో జ్యోతిష్యశాస్త్రం ప్రాచూర్యంలో ఉంది. జ్యోతిష్యశాస్త్రం ద్వారా రానున్న కాలంలో ఏ రాశివారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తాయన్న విషయాలను తెలుసుకోవచ్చని మన పూర్వీకులు నమ్మేవారు. ఈ జ్యోతిష్యశాస్త్రం మన దేశంలోనే కాక ఇతర దేశాల సంస్కృతిలో కూడా భాగం అయి ఉంది. ఇక ఈ జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు, గ్రహ సంయోగాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. అయితే రెండు రోజుల కిందటే శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ రాహు సంచరిస్తున్న కారణంగా మేషరాశిలో శుక్రుడు-రాహువు కలయిక ఏర్పడింది. ఇక ఈ మేషరాశిలో శుక్రుడు-రాహువు సంయోగం వల్ల రాశిచక్రంలోని మూడు రాశులవారు అపారమైన పురోగతి సాధిస్తారు. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్ర-రాహు కలయిక ఈ 3 రాశులకు శుభకరం:

మకర రాశి: మేషరాశిలో శుక్రుడు-రాహువు కలయిక మకర రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఈ రాశివారి కోరికలన్నీ శుక్ర-రాహు కలయిక సమయంలో నెరవేరుతాయి. ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రయత్నించేవారికి కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.

మేష రాశి: శుక్ర-రాహువు సంయోగం మేషరాశి వారికి చాలా మేలు చేస్తుంది. వీరు తమ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. భారీగా ఆదాయం పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తారు. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమయం మేషరాశివారికి బాగా కలిసి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: రాహువు-శుక్రుల సంయోగం మిథునరాశి వారి జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలుగా మారుతాయి. ఆర్థికంగా కూడా పురోగమిస్తారు.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..