MI vs GG-WPL 2023: హర్మన్‌ప్రీత్ సేనకు చెక్ పడేనా..? పోరుకు గుజరాత్ రెడీ..! తుది జట్టు వివరాలివే..

టోర్నీ మొదటి మ్యాచ్ నుంచి ఆడిన 4 మ్యాచ్‌లలోనూ విజయం సాధించి.. అపజయం అంటే ఏమిటో తెలియని విధంగా హర్మన్‌ప్రీత్ సేన ముందుకు సాగుతోంది.  మరోవైపు గుజరాత్..

MI vs GG-WPL 2023: హర్మన్‌ప్రీత్ సేనకు చెక్ పడేనా..? పోరుకు గుజరాత్ రెడీ..! తుది జట్టు వివరాలివే..
Mi Vs Gg Wpl 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 14, 2023 | 6:38 PM

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగులో భాగంగా జరుగుతున్న 12వ మ్యాచ్‌‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే తలపడిన ఈ రెండు జట్లలో ముంబై పైచేయి సాధించింది. అంతేకాక టోర్నీ మొదటి మ్యాచ్ నుంచి ఆడిన 4 మ్యాచ్‌లలోనూ విజయం సాధించి.. అపజయం అంటే ఏమిటో తెలియని విధంగా హర్మన్‌ప్రీత్ సేన ముందుకు సాగుతోంది.  మరోవైపు గుజరాత్ జెయింట్స్ జట్టు ఆడిన 2 మ్యాచ్‌లలో రెండో మ్యాచ్ మినహా మిగిలిన 3 మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబైతో రెండోసారి ఢీకొడుతున్న నేటి మ్యాచ్‌లో ఎలా అయినా గెలవాలని గుజరాత్ జట్టు భావిస్తోంది.

అయితే ఇరు జట్ల సారథుల విషయానికొస్తే.. ముంబైని నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్(టీమిండియా కెప్టెన్ కూడా) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి కూడా తిరుగులేని విధంగా దూసుకెళ్తోంది. వారిని అడ్డుకొనే జట్టే టోర్నీలో కనిపించడం లేదు. టీమ్ విజయం కోసం ఓపెనింగ్‌లో హేలీ మాథ్యూస్‌, యస్తికా భాటియా దంచికొడుతున్నారు. అలాగే ఒకరు కాకపోతే మరొకరు క్రీజులో నిలబడుతున్నారు. ఇంకా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, కెప్టెన్సీ, వ్యూహాలు ఇలా అన్ని విభాగాల్లో కూడా ముంబై అమ్మాయిలు పటిష్ఠంగా ఉన్నారు. ఇక గుజరాత్ జెయింట్స్ విషయానికోస్తే.. అనుకున్న స్థాయిలో విజయాలు దక్కడం లేదు గానీ ఆ జట్టు స్పోర్టింగ్‌ స్పిరిట్‌ను మెచ్చుకోవాల్సిందే..! ఎన్ని కష్టాలొచ్చినా ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగుతున్నారు. అయితే ఓపెనర్‌ మేఘనా నుంచి ఆశించిన ఓపెనింగ్స్‌ రావడం లేదు. ప్రతిభ ఉండటంతో మేనేజ్‌మెంట్‌ను ఆమెకు అండగా నిలుస్తోంది. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసిన సోఫియా డంక్లీపై అంచనాలు పెరిగాయి. హర్లీన్‌ డియోల్‌ మిడిలార్డర్‌లో ఆదుకొంటోంది. అలాగే గుజరాత్‌ బౌలింగ్ కూడా ఫర్వాలేదు. అయితే టీమ్ కెప్టెన్ స్నేహ్‌ రాణా, యాష్లే గార్డ్‌నర్‌ స్పిన్‌లో వికెట్లు తీయాల్సి ఉంది. ఈ సీజన్లో డెత్‌ ఓవర్లలో వరస్ట్‌ ఎకానమీ 14.71 గుజరాత్‌దే.

ఇవి కూడా చదవండి

తుది జట్లు(అంచనా)

ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్‌ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్

గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్‌ సుథర్‌ల్యాండ్‌, స్నేహ్ రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మాన్సీ జోషీ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..